https://oktelugu.com/

Radhe shyam: సోషల్ మీడియా లో వైరల్ గా మారిన “రాధే శ్యామ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు…

Radhe shyam: దేశ వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రాధే శ్యామ్ మూవీ ఎట్టకేలకు విడుదలకు సిద్ధం అవుతోంది. బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ఆయన నటించిన ఈ ప్యాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి పండుగ కానుకగా జనవరి 14న విడుదలకానుంది. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ప్రేమకథగా ఈ మూవీ తెరకెక్కుతుంది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 23, 2021 / 04:56 PM IST
    Follow us on

    Radhe shyam: దేశ వ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రాధే శ్యామ్ మూవీ ఎట్టకేలకు విడుదలకు సిద్ధం అవుతోంది. బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ఆయన నటించిన ఈ ప్యాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి పండుగ కానుకగా జనవరి 14న విడుదలకానుంది. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ప్రేమకథగా ఈ మూవీ తెరకెక్కుతుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించారు. అయితే చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్‌ ను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే నేడు హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రిరిలీజ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసింది.

    ఈ వేడుకకు సంబంధించిన ఒక్కో విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను టాలెంటెడ్ యువ నటుడు నవీన్ పొలిశెట్టి హోస్ట్ చేయనున్నారని టాక్ నడుస్తోంది. అలానే ఈ వేడుకకు దర్శక ధీరుడు రాజమౌళి తో పాటు ప్రభాస్ తో సినిమాలు చేస్తున్న దర్శకులంతా హాజరు కానున్నారని సమాచారం. ఇక తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను మూవీ యూనిట్ షేర్ చేసింది. నేషనల్ లెవెల్ లో జరగనున్న ఈ ఈవెంట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా, ఈ సినిమాతో పాటు, ప్రభాస్​ సలార్​, ఆదిపురుష్​ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్​ సినిమా షూటింగ్​ పూర్తయింది.