https://oktelugu.com/

Dhanush: తెలుగు తెర పై తమిళ ‘సార్’ వస్తున్నాడు !

Dhanush: ధనుష్ ప్రస్తుతం రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయబోతున్న సంగతి తెలిసిందే. అందులో ఒక సినిమా ‘శేఖర్ కమ్ముల’ది. రెండో సినిమా ‘వెంకీ అట్లూరి’ది. అయితే, ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ‘వెంకీ అట్లూరి’ – ధనుష్ సినిమా టైటిల్ ఫిక్స్ అయిందట. ఈ సినిమాకి ‘సార్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పైగా వచ్చే నెల 28 నుంచి ఈ సినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయనున్నారు. నిజానికి శేఖర్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 23, 2021 / 04:52 PM IST
    Follow us on

    Dhanush: ధనుష్ ప్రస్తుతం రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేయబోతున్న సంగతి తెలిసిందే. అందులో ఒక సినిమా ‘శేఖర్ కమ్ముల’ది. రెండో సినిమా ‘వెంకీ అట్లూరి’ది. అయితే, ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ‘వెంకీ అట్లూరి’ – ధనుష్ సినిమా టైటిల్ ఫిక్స్ అయిందట. ఈ సినిమాకి ‘సార్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. పైగా వచ్చే నెల 28 నుంచి ఈ సినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయనున్నారు.

    Dhanush Sir

    నిజానికి శేఖర్ కమ్ముల సినిమానే ధనుష్ ముందు ఒప్పుకున్నాడు. కానీ, ఆ సినిమా కన్నా ముందు వెంకీ అట్లూరి సినిమా షూటింగే ముందు స్టార్ట్ అవ్వడం పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, స్టోరీ, స్క్రీన్ ప్లే రెడీ చేయడంలో శేఖర్ కమ్ముల చాలా లేట్. కానీ మరోపక్క వెంకీ అట్లూరి ఇప్పటికే స్టోరీ, స్క్రీన్ ప్లే రెడీ చేసి ఉంచాడు. అందుకే ధనుష్ వెంకీ సినిమాను ముందు స్టార్ట్ చేయబోతున్నాడు.

    అయితే హీరో ధనుష్ డేట్స్ కోసం తమిళ నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధనుష్ ఏరి కోరి తెలుగు నిర్మాతలతో ద్విభాషా చిత్రాలు చేస్తున్నాడు. అందుకే తమిళ నిర్మాతలు ఈ విషయంలో ధనుష్ పై సీరియస్ గా ఉన్నారు. ఇంతకీ ధనుష్ తమిళ నిర్మాతలు కంటే.. తెలుగు దర్శనిర్మాతలతో సినిమాలు చేయడానికి కారణం.. భారీ పారితోషికమే.

    Also Read: Amritha Aiyer: అల్లు అర్జున్ తో పాటు సమంత కూడా ఇష్టం అట !

    తమిళంలో ధనుష్ కి ఎలాగూ మార్కెట్ ఉంది. అదే తెలుగు దర్శనిర్మాతలతో సినిమా చేస్తే.. తెలుగులో కూడా సినిమాకి ఫుల్ మార్కెట్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొందరు నిర్మాతలు ధనుష్ కి రెట్టింపు పారితోషికం ఆఫర్ చేశారు. ఆ పారితోషికం కారణంగానే ధనుష్ సినిమాల ఎంపిక మారింది. కానీ తమిళ నెటిజన్లు మాత్రం ఈ విషయంలో ధనుష్ పై విరుచుకు పడుతున్నారు. ధనుష్ మాత్రం సైలెంట్ గా తన సినిమాలు తాను చేసుకుంటూ పోతున్నాడు.

    Also Read: Pushpa Collections: బాక్సాఫీస్ : ‘పుష్ప’ 6 రోజుల కలెక్షన్స్ !

    Tags