https://oktelugu.com/

Kamal Haasan: కమల్ ‘విక్రమ్’ పై స్పీడ్ పెంచాడు.. మార్చిలోనే రిలీజ్ !

Kamal Haasan:  లోక నాయకుడు కమల్ హాసన్ ఏమి చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. ముఖ్యంగా కమల్ సినిమాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అందుకే కమల్ కరోనా కాలంలో కూడా సినిమా షూటింగ్ చేయడానికి ప్రయత్నాలు చేశాడు. అయితే, మధ్యలో కమల్ కరోనా బారిన పడి ఆరోగ్య పరంగా చాలా ఇబ్బంది పడ్డారు. దాంతో సినిమాల షూటింగ్స్ కి కూడా గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే, కమల్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అందుకే, మళ్ళీ సెట్ పైకి […]

Written By: , Updated On : December 23, 2021 / 04:59 PM IST
Follow us on

Kamal Haasan:  లోక నాయకుడు కమల్ హాసన్ ఏమి చేసినా ప్రత్యేకంగానే ఉంటుంది. ముఖ్యంగా కమల్ సినిమాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. అందుకే కమల్ కరోనా కాలంలో కూడా సినిమా షూటింగ్ చేయడానికి ప్రయత్నాలు చేశాడు. అయితే, మధ్యలో కమల్ కరోనా బారిన పడి ఆరోగ్య పరంగా చాలా ఇబ్బంది పడ్డారు. దాంతో సినిమాల షూటింగ్స్ కి కూడా గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే, కమల్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు.

Kamal Haasan

Kamal Haasan

అందుకే, మళ్ళీ సెట్ పైకి వచ్చి గ్యాప్ లేకుండా షూట్ లో పాల్గొనడానికి ఫుల్ డేట్స్ కేటాయించాడు. కమల్ నటిస్తున్న తాజా సినిమా ‘విక్రమ్’. ఈ సినిమా పై కమల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఒక విధంగా ఈ సినిమా కమల్ కెరీర్ కి చాలా కీలకం. అసలు తనకు మార్కెట్ లేదు అని ఫిక్స్ అయిపోయిన నిర్మాతలకు సమాధానంగా కమల్ ఈ సినిమా చేస్తున్నాడు.

అందుకే, సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ సినిమా చేస్తున్నాడు. అయితే, వచ్చే నెల 10 లోపు ఈ షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేయాలని కమల్ ఫిక్స్ అయ్యాడు. ఆ తర్వాత కమల్ హాసన్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించలేదు. ఈ సినిమాని త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలి అనేది కమల్ ఆలోచన.

ఇక ఈ సినిమా పై బాగానే అంచనాలు ఉన్నాయి. దానికి కారణం.. ‘ఖైదీ’, ‘మాస్టర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలు తీసిన లోకేష్ కనకరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అందుకే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అన్నట్టు ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Also Read: Dhanush: తెలుగు తెర పై తమిళ ‘సార్’ వస్తున్నాడు !

ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేస్తారట. అన్నట్టు కమల్ హాసన్ ఈ సినిమాతో పాటు ‘భారతీయుడు 2’ సినిమా కూడా చేసున్నాడు. మధ్యలో ఆగిపోయిన ఆ సినిమాని కూడా పూర్తి చేయాలని, వచ్చే సమ్మర్ లో ఆ సినిమాని రిలీజ్ చేయాలని కమల్ శంకర్ ను కోరాడు. మరి శంకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Also Read:Komuram Bheemudo Song: ఆర్ఆర్ఆర్ : ‘కొమురం భీముడో’ సాంగ్ లిరిక్స్ వాటి అర్దాలివే !

Tags