https://oktelugu.com/

Radhe Shyam Collection: రాధేశ్యామ్ విష‌యంలో జ‌ర‌గ‌ని పుష్ప త‌ర‌హా మ్యాజిక్‌.. డిజాస్ట‌ర్ టాక్ క‌న్ఫ‌ర్మ్‌..!

Radhe Shyam Collection: ఒక పెద్ద సినిమా వ‌స్తుందంటేనే ఎన్నో అంచ‌నాలు ఉంటాయి. ఇక హిట్ టాక్ సొతం చేసుకుందంటే మాత్రం రికార్డుల సునామీ ఖాయం అనే చెప్పొచ్చు. అయితే కొన్ని సినిమాల‌కు మొద‌టి రోజు ప్లాప్ టాక్ వ‌చ్చినా.. త‌ర్వాత రెండు మూడు రోజుల్లో పాజిటివ్ టాక్ రావ‌డం చాలా సార్లు చూశాం. ఇప్పుడు రాధేశ్యామ్ మూవీ విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతుంద‌ని అంతా అనుకున్నారు. పుష్ప మూవీకి మొద‌టి రోజు నెగెటివ్ టాక్ వచ్చినా.. […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 18, 2022 / 12:39 PM IST
    Follow us on

    Radhe Shyam Collection: ఒక పెద్ద సినిమా వ‌స్తుందంటేనే ఎన్నో అంచ‌నాలు ఉంటాయి. ఇక హిట్ టాక్ సొతం చేసుకుందంటే మాత్రం రికార్డుల సునామీ ఖాయం అనే చెప్పొచ్చు. అయితే కొన్ని సినిమాల‌కు మొద‌టి రోజు ప్లాప్ టాక్ వ‌చ్చినా.. త‌ర్వాత రెండు మూడు రోజుల్లో పాజిటివ్ టాక్ రావ‌డం చాలా సార్లు చూశాం. ఇప్పుడు రాధేశ్యామ్ మూవీ విష‌యంలో కూడా ఇదే జ‌రుగుతుంద‌ని అంతా అనుకున్నారు.

    Radhe Shyam Collection

    పుష్ప మూవీకి మొద‌టి రోజు నెగెటివ్ టాక్ వచ్చినా.. త‌ర్వాత మాత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. ఇలాంటి మాయ ఏదైనా రాధేశ్యామ్ విష‌యంలో జ‌రుగుతుంద‌ని అంతా అనుకున్నారు. ఏదైనా అద్భుతం జరగుతుందేమో అని అంతా ఎదురు చూశారు. కానీ అలాంటి మ్యాజిక్ ఏం జ‌ర‌గ‌లేదు. మొదటివారం 80శాతం బ్రేక్ ఈవెన్ సాధిస్తుంద‌ని అంతా అనుకున్నారు.

    Also Read: Bheemla Nayak OTT Release: భీమ్లానాయక్ ఓటీటీలో వచ్చే డేట్ ఇదే.. కన్ఫర్మ్ చేసిన మేకర్స్..

    కానీ నిన్న‌టితో మొద‌టి వారం పూర్త‌యిపోయింది. కానీ ఎలాంటి మ్యాజిక్ జ‌ర‌గ‌లేదు. పూర్తి డిజాస్ట‌ర్ టాక్ ఖాయం అయిపోయింది. ఈ వారంలో తెలుగు రాష్ట్రాల్లో రూ.55 కోట్ల వ‌ర‌కు షేర్ వ‌సూలు చేసింది. ఈ డిజాస్ట‌ర్ టాక్ తో ఆ మొత్తం వ‌సూలు చేయాలంటే క‌ష్టం అని తేలిపోయింది. దీంతో ఏపీ, నైజాంలో క‌లిపి దాదాపు రూ.40 కోట్ల వ‌ర‌కు న‌ష్టం తప్పేలా లేదు.

    Radhe Shyam Collection

    వారం రోజులుగా ఎలాంటి క‌లెక్ష‌న్లు పెద్ద‌గా రావ‌ట్లేదు. ఇంకా చెప్పాలంటే రాధేశ్యామ్ కంటే కశ్మీర్ ఫైల్స్ బాగా క‌లెక్ష‌న్లు రాబ‌డుతోంది. ఒక్క తెలుగులోనే ప‌రిస్థితి ఇలా ఉంటే.. ఇత‌ర భాష‌ల్లో మాత్రం దారుణంగా ప‌రిస్థితి త‌యార‌యింది. ఓవర్సీస్ లో మాత్రం ఈ మూవీకి కొద్దో గొప్పో క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి. రేపు, ఎల్లుండి వ‌ర‌కు రాధేశ్యామ్ పూర్తిగా క‌లెక్ష‌న్లు ప‌డిపోయే ప్ర‌మాదం ఉంది. ఇప్పుడు అంతా ఆర్ ఆర్ ఆర్ గురించే చ‌ర్చించుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే రాధేశ్యామ్ థియేట‌ర్ల‌లో ఆడుతుంద‌నే విష‌యం కూడా మ‌ర్చిపోతున్నారు.

    Also Read:  ప్రమోషన్స్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్న రాజమౌళి.. ఇవేం ఇంటర్వ్యూలు బాబోయ్..

    Tags