Prabhas Puri Jagannadh New Movie Updates: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్(Puri Jagannadh)…ఆయన చేసిన సినిమాలు యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తూ వచ్చాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు… లైగర్, డబుల్ ఇస్మార్ట్ రెండు సినిమాలతో బొక్క బోర్లా పడ్డ పూరి జగన్నాథ్ ఇప్పుడు విజయ్ సేతుపతితో కలిసి బెగ్గర్ అనే సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయింది. ఇక ఇది ఇలా ఉంటే ఆయన ప్రభాస్ ని కలిసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ రాజాసాబ్ షూట్ లో ఉన్నప్పటికీ పూరి అక్కడికి వెళ్లి మరి ప్రభాస్ ను కలిశారు. కారణం ఏంటి అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి తో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్ తో ఒక సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట. అందుకోసమే అతన్ని కలిసి ఆ సినిమాకు సంబంధించిన కథను చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ప్రభాస్ సైతం కథను విన్న తర్వాత తను కొంచెం టైం కావాలని, ఒక వన్ వీక్ లో తన డిసిజన్ ఏంటో చెబుతానని చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే పూరి జగన్నాథ్ ప్రభాస్ తో ఒక భారీ సినిమాని ప్లాన్ చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
Also Read: రాజమౌళి కథ చెబితే రిజెక్ట్ చేసిన ఏకైక హీరో ఎవరో తెలుసా..?
పూరి ఎప్పటి నుంచో తన కెరియర్లోనే డ్రీమ్ ప్రాజెక్టుగా భావిస్తున్న ఒక సబ్జెక్టుని ప్రభాస్ తో చేయాలని నిశ్చయించుకున్నారట. దానికి సంబంధించిన కథ చర్చలను ప్రభాస్ తో జరిగినట్టుగా తెలుస్తోంది. మరి ప్రభాస్ కనక ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైతే దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ను తెరకెక్కించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి…
ఈ సినిమా కనక వర్కౌట్ అయితే మాత్రం పూరి జగన్నాథ్ పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా మరోసారి తన సత్తా చాటుకుంటాడు. అలాగే ప్రభాస్ సైతం ఈ సినిమాతో భారీ సక్సెస్ సాధిస్తాడా లేదంటే డీలా పడిపోతాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే పూరి జగన్నాథ్ – ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు.
Also Read: నాగార్జున కొట్టిన దెబ్బలకు ముఖం వాచిపోయింది… హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
బుజ్జిగాడు సినిమాతో ప్రభాస్ కి ఒక స్టార్ ఇమేజ్ వచ్చినప్పటికి ఆయన నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శించినప్పటికి ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ మాత్రం సాధించలేదు… ఇక ఏక్ నిరంజన్ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని అయితే లేదు. మరి ఈ రెండు సినిమాలతో అతనికి సక్సెస్ ని ఇవ్వలేకపోయిన పూరి ఇప్పుడు భారీ సక్సెస్ ని అందిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…