Prabhas and Prashanth Neel : ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని షేక్ చేసిన హీరోల్లో ప్రభాస్ మొదటి స్థానం లో ఉంటాడు…ఈయన చేసిన మొదటి సినిమా నుంచి చివరగా వచ్చిన కల్కి (Kalki) సినిమా వరకు తన నట ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు సాగిన ఆయన ఎట్టకేలకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడనే చెప్పాలి. వాళ్ళ పెదనాన్న అయిన రెబల్ స్టార్ కృష్ణం రాజు (Krishnam Raju) ఇమేజ్ ను పునికి పుచ్చుకొని తనకంటు స్టార్ హీరో ఇమేజ్ ను సంపాదించుకొని ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ఫ్యాన్స్ ఆయన్ని ముద్దుగా ‘డార్లింగ్’ (Darling) అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఆయన చేస్తున్న వరుస సినిమాలు పాన్ ఇండియా ను షేక్ చేసే సినిమాలే కావడం విశేషం. మారుతి డైరెక్షన్లో ఆయన చేస్తున్న రాజాసాబ్ సినిమా తొందర్లో రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ (Fouji) సినిమా ఎంత తొందరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తర్వాత స్పిరిట్ (Spirit) సినిమాని కూడా సెట్స్ మీదకు తీసుకురావాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఆయన చేసిన సలార్ (Salaar) సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించిన విషయం మనకు తెలిసిందే.
Also Read :ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా..?
మరి ప్రశాంత్ నీల్ తో ఆయన సలార్ 2 సినిమా ఎప్పుడు చేయబోతున్నాడు అనే విషయం మీదనే సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 2027 వ సంవత్సరంలో ఈ సినిమాని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఫౌజీ (Fouji) సినిమా 2025 లో పూర్తి అవ్వగా, స్పిరిట్ సినిమాను 2026 సంవత్సరం పూర్తి చేసి 2027 వ సంవత్సరంలో సలార్2, కల్కి2 రెండు సినిమాలను పట్టాలెక్కించే పనుల్లో బిజీ కానున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పటి వరకు ప్రభాస్ ను దర్శకులందరూ ఒకలా చూపిస్తే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మాత్రం ప్రభాస్ కి భారీ ఎలివేషన్స్ ఇచ్చి తనను నెక్స్ట్ రేంజ్ కి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాడు.
ఇక సలార్ సినిమా విషయంలో ప్రభాస్ విపరీతంగా కష్టపడ్డాడు. ఫైట్స్ లో తను చాలా వరకు డూప్ లేకుండా చేసి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేశాడు. మరి సలార్ 2 విషయంలో కూడా అదే జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు ప్రభాస్ సంవత్సరానికో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లే అవకాశాలైతే ఉన్నాయి.
Also Raed : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ నుండి బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేసింది!