ప్రభాస్ స్టార్ డమ్ వేగంగా విస్తరిస్తోంది. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్.. సాహో చిత్రంతోనూ బాలీవుడ్లో సత్తా చాటాడు. ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాలో లైన్లో ఉన్నాయి. రాధేశ్యామ్ జులైలో విడుదలకు సిద్ధమవుతుండగా.. మిగిలిన సలార్, ఆదిపురుష్ షూటింగ్ పారలాల్ గా కంటిన్యూ అవుతోంది. ఇవి రెండూ పూర్తయిన తర్వాత నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ సెట్స్ పైకి వెళ్తుంది.
సినిమాల్లో స్టార్ డమ్ తో దూసుకెళ్తున్న ప్రభాస్.. ఇప్పుడు రోడ్లపైనా రయ్య్ మంటూ దూసుకెళ్లబోతున్నారు. దీనికోసం సరికొత్త కారు కొనుగోలు చేశారట! ఖరీదైన కార్లపై మనసు పారేసుకునే రెబల్ స్టార్.. గ్యారేజ్ లో ఇప్పటికే చాలా కార్లు ఉన్నాయి. కానీ.. ఇప్పుడువాటన్నింటికి బాప్ అనిపించుకునే కార్ రావడంతో.. అవన్నీ సైడ్ ఇచ్చేశాయట!
అదే లాంబోర్గిని. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లాంబోర్గిని అవెంటాడర్ ఎస్ రోడ్ స్టర్ కారును ప్రభాస్ కొన్నాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కారుపక్కన ప్రభాస్ నిలబడి దిగిన ఫొటో చక్కర్లు కొడుతోంది. ఇండియాలో ల్యాండ్ అయిన ఈ క్రేజీ వెర్షన్ రెండోది మాత్రమేనని సమాచారం. దీంతో ఈ కారును సొంతం చేసుకున్న రెండో పర్సన్ గా ప్రభాస్ నిలిచారు.
అంతేకాదు.. ఇదే రోజు ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు బర్త్ డే. ఈ రోజునే ఇలాంటి కారు కొనుగోలు చేయడంతో ఆయన సంస్మరణ కూడా ప్రత్యేకంగా ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ కారులో ఇప్పటికే ఫ్యామిలీ మెంబర్స్ తో ఓ రౌండ్ కూడా వేశాడట ప్రభాస్.