https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. ప్రభుత్వ బ్యాంక్ లో 56 జాబ్స్..?

ప్రముఖ బ్యాంకులలో ఒకటైన పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ లో 56 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. అకడమిక్‌ ప్రతిభ, అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. Also Read: 3479 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే..? ఇప్పటికే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 30, 2021 11:53 am
    Follow us on

    Punjab and Sind Bank Recruitment 2021

    ప్రముఖ బ్యాంకులలో ఒకటైన పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ లో 56 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. అకడమిక్‌ ప్రతిభ, అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

    Also Read: 3479 టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే..?

    ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఏప్రిల్ 3వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. https://psbindia.com/ వెబ్ సైట్ ద్వారా 56 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అధికారులు దరఖాస్తుల సంఖ్యను బట్టి ఈ ఉద్యోగాలకు రాత పరీక్షను నిర్వహించాలో లేదో నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ లో 304 ఉద్యోగ ఖాళీలు..?

    మొత్తం 56 ఉద్యోగ ఖాళీలలో అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌(లా) ఉద్యోగ ఖాళీలు 1, చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలు 1, రిస్క్‌ మేనేజర్లు ఉద్యోగ ఖాళీలు 4, ఐటీ మేనేజర్లు ఉద్యోగ ఖాళీలు 50 ఉన్నాయి. లా డిగ్రీ పూర్తి చేసి 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (లా) ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగానికి 35 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

    ఫస్ట్ క్లాస్ డిగ్రీతో పాటు పీజీ చదివిన వాళ్లు రిస్క్ మేనేజర్ల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈ, బీటెక్, ఎం.ఈ, ఎంటెక్ లో కంప్యూటర్ సబ్జెక్ట్స్ చదివిన వాళ్లతో పాటు ఎంసీఏ చదివిన వాళ్లు ఐటీ మేనేజర్ల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.