Prabhas Directors: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాడు. ముఖ్యంగా పాన్ ఇండియాలో వరుస సక్సెస్ లను సాధిస్తున్న హీరో కూడా తనే కావడం విశేషం…ఇక ప్రస్తుతం ఎవ్వరికి సాధ్యం కానీ రీతిలో ఎక్కువ పాన్ ఇండియా సినిమాలను చేసిన హీరోగా కూడా పేరు సంపాదించుకున్నాడు. అలాంటి ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా ఆయన మరో సినిమా కూడా చేయడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉండడం విశేషం… ఇక ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయాలని చూస్తున్నారు… ఇక ఇదిలా ఉంటే కెరియర్ మొదట్లో ప్రభాస్ తో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ఆసక్తిని చూపించారు. కానీ కొంతమందితో మాత్రం ప్రభాస్ సినిమా చేయలేకపోయాడు. ఇక ఇప్పటికి ఆ దర్శకులతో తను సినిమా చేయలేనని చెప్పడం విశేషం… భద్ర సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత బోయపాటి శ్రీను ప్రభాస్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత సైతం బోయపాటి శ్రీను చెప్పిన కథ ప్రభాస్ కి నచ్చకపోవడంతో ఆయనను పలుసార్లు రిజెక్ట్ చేశాడు. ఎందుకంటే బోయపాటి శ్రీను సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నప్పటికి ఆయన సినిమాలు రొటీన్ కాన్సెప్ట్ తో ఉంటాయనే ఉద్దేశ్యంతోనే ప్రభాస్ అతన్ని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా బోయపాటి లాంటి ఒక దర్శకుడు ప్రభాస్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించిన కూడా ప్రభాస్ అతనితో సినిమా చేయకపోవచ్చు. కారణం ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ రేంజ్ మారిపోయింది. 2000 కోట్ల కలెక్షన్స్ ను ఈజీగా రాబట్టగలిగే కెపాసిటి ఉన్న ప్రభాస్ రొటీన్ సినిమాలను చేయగలిగే బోయపాటి శ్రీనుతో సినిమా చేయలేకపోవచ్చు.
ఇక దానికి తోడుగా ఆయన మరో దర్శకుడితో కూడా సినిమాలు చేసే అవకాశాలైతే లేవు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే సుకుమార్ కావడం విశేషం…
‘ఆర్య 2’ సినిమా తర్వాత సుకుమార్ ప్రభాస్ కోసం ఒక కథనైతే రాసుకున్నాడు. కానీ ప్రభాస్ అప్పుడు బిజీగా ఉండడంవల్ల అతనితో సినిమా చేయలేదు. ఆ తర్వాత కూడా ప్రభాస్ ఒకసారి సుకుమార్ తో సినిమా చేద్దామని అడిగాడట. కానీ సుకుమార్ అప్పుడు బిజీగా ఉండడం వల్ల ఆ కాంబినేషన్ కుదరలేదు.
ఇక ఇప్పుడు సుకుమార్ ఒక కథ చెప్పిన కూడా ప్రభాస్ అతనితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ అడిగినప్పుడు తను సినిమా చేయలేదు కాబట్టి ఇప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి అంటూ కొంతమంది సినిమా మేధావులైతే చెబుతున్నారు…
