https://oktelugu.com/

Prabhas : ‘వరల్డ్ వార్’ బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ కొత్త సినిమా..కానీ డైరెక్టర్ ఎవరో చూస్తే నోరెళ్లబెడుతారు!

సీతారామం వంటి చిత్రాన్ని తెరకెక్కించిన హను రాఘవపూడి. రీసెంట్ గానే ప్రభాస్ ని కలిసి స్టోరీ చెప్పి ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నాడట. ఈ చిత్రం 'వరల్డ్ వార్ 2 ' నేపథ్యం లో తెరకెక్కించబోతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 26, 2023 / 10:02 PM IST
    Follow us on

    Prabhas  : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ స్టేటస్ ని ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నాడో మన అందరికీ తెలిసిందే. టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ప్రతీ దర్శకుడు ప్రభాస్ తో ఒక సినిమా చెయ్యడానికి అమితాసక్తిని చూపిస్తారు. కానీ ప్రభాస్ మాత్రం ఫ్యాన్స్ ఊహలకు అందని డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నాడు. బాహుబలి తర్వాత ఆయన ఫ్యాన్స్ కి ఉన్న నిరాశ ఇదే.

    సుజిత్ – రాధా కృష్ణ లాంటి అనుభవం లేని దర్శకులతో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు తియ్యడమే కాకుండా, మారుతీ లాంటి మీడియం రేంజ్ డైరెక్టర్ తో ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత ఒక్క ‘సలార్’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ మినహా మిగిలిన డైరెక్టర్స్ అందరూ కూడా చిన్నవాళ్ళే.

    ఇప్పుడు మరో మీడియం రేంజ్ డైరెక్టర్ తో ప్రభాస్ కొత్త సినిమా ఖరారు అయ్యింది. ఆ డైరెక్టర్ మరెవరో కాదు, సీతారామం వంటి చిత్రాన్ని తెరకెక్కించిన హను రాఘవపూడి. రీసెంట్ గానే ప్రభాస్ ని కలిసి స్టోరీ చెప్పి ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నాడట. ఈ చిత్రం ‘వరల్డ్ వార్ 2 ‘ నేపథ్యం లో తెరకెక్కించబోతున్నారు.

    ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి మంచి డైరెక్టరే, కానీ ప్రభాస్ లాంటి స్టార్ హీరో ని మ్యానేజ్ చేయగలడా లేదా అనే అనుమానం ప్రతీ అభిమానిలో ఉంది. ఎందుకంటే ప్రభాస్ గత రెండు చిత్రాల దర్శకులు ఆయన స్టార్ ఇమేజి ని మ్యాచ్ చెయ్యలేక చతికిలపడినవారే, మరోపక్క ‘సీతారామం’ చిత్రం మినహా, మరో భారీ హిట్ ఆయన కెరీర్ లో లేదు, అలాంటి డైరెక్టర్ ప్రభాస్ తో ఎలా తీస్తాడో అని కంగారు పడుతున్నారు ఫ్యాన్స్.