
సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు బాలీవుడ్ ఇండస్ట్రీని కుదేలు చేస్తోంది. ఈ కేసులో డ్రగ్ కోణం వెలుగుచూడటంతో బాలీవుడ్లోని చీకటి కోణాలు ఒక్కోక్కటి వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు, నటి రియా చక్రవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణ ఆమె డ్రగ్స్ సంబంధం ఉన్న పలువురు సెలబ్రెటీల పేర్లు వెల్లడించింది.
Also Read: ఆ దర్శకుడు దుస్తులు విప్పమన్నాడు
దీంతో ఎప్పుడెవరూ అరెస్టు అవుతారనే ఆందోళనలో బాలీవుడ్లోని ప్రముఖులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ కేసుతో సంబంధం లేకున్నా యంగ్ రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లని ప్రభాస్ పేరును డ్రగ్ కేసులో ప్రచారం చేస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రభాస్ చేస్తున్న మంచి విషయాల కంటే ఎక్కువగా ఇలాంటి విషయాలే ఎక్కువగా వైరల్ అవుతుండటం గమనార్హం.
డ్రగ్ కేసులో ఇటీవల నటి సంజాన గల్రాని అరెస్టు అయింది. ఆమె ప్రభాస్ సరసన ‘బుజ్జిగాడు’ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. దీంతో ప్రభాస్ హీరోయిన్ డ్రగ్ కేసులో అరెస్టు అంటూ ప్రభాస్ ఫొటోలతో మీడియా, పలు వెబ్ సెట్లు వార్తలు ప్రచురించాయి. అదేవిధంగా కంగనా రనౌత్ సైతం ‘ఏక్ నిరంజన్’ మూవీలో ప్రభాస్ కు జోడీగా నటించింది.
కంగనా రనౌత్-శివసేన మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ఈక్రమంలోనే కంగాన ఇంటిని ముంబై మున్సిపాలిటీ కూల్చివేసింది. అయితే కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ప్రభాస్ హీరోయిన్ బంగ్లాను కూల్చివేసారంటూ రకరకాల హెడ్డింగ్ లు, థంబ్ నెయిల్స్ వాడి ప్రచారం చేసుకుంటున్నారు.
Also Read: వకీల్ సాబ్ కి గ్రీన్ సిగ్నల్.. ఫ్యాన్స్ కి ఒరిగేదేమీ లేదు !
ఈ రెండు విషయాల్లోనూ ప్రభాస్ ఏమాత్రం సంబంధం లేకుండానే ఆయన పేరు తెరపైకి వస్తోంది. ప్రభాస్ ఇమేజ్ ను క్యాష్ చేసుకునే క్రమంలో కొందరు అనవసరంగా ప్రభాస్ పేరును చెడగొడుతున్నారు. ప్రభాస్ సరసన ఆ హీరోయిన్లు నటించిన పాపానానికి ప్రభాస్ పై బురదజల్లే యత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం నెటిజన్లు గూగుల్ ల్లో సెర్చ్ చేస్తే ప్రభాస్ సినిమాల కంటే ఈ రెండు విషయాలపై ఎక్కువగా కన్పిస్తున్నాయనే టాక్ విన్పిస్తుంది. ప్రభాస్ ఇటీవల వందల ఎకరాల ఫారెస్టు దత్తత తీసుకున్న వార్తకు కూడా ఇంత ప్రచారం జరుగలేదని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ప్రభాస్ పేరు రోజు వార్తల్లో నానుతున్నందుకు సంతోషించాలా? లేక బాధపడాలో తెలియనిస్థితిలో ఆయన ఫ్యాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
Comments are closed.