
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య.. డ్రగ్ కేసులతో ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీ పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుంది. ఇప్పటికే నెటిజన్లు సోషల్ మీడియాలో బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులందరినీ ఏకిపారేస్తున్నారు. ఈ తరుణంలోనే బాలీవుడ్ దర్శకుడిపై ఓ ప్రముఖ మోడల్ సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
Also Read: డ్రగ్ కేసులో ప్రభాస్ ‘కటౌట్’ ను వాడేస్తున్నారు..!
బాలీవుడ్లో ‘మీ టూ ఉద్యమం’ మొదలైనపుడే దర్శకుడు సాజిద్ ఖాన్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. సాజిద్ ఖాన్ లైగింకంగా వేధింపులు ముగ్గురు మహిళలు ఆయనపై ఆరోపణలు గుప్పించారు. దీంతో నాడు ‘హౌజ్ ఫుల్-4’ నిర్మాతలు అతడిని ఈ ప్రాజెక్టును తొలగించి కొత్తవారితో సినిమాను పూర్తి చేశారు.
తాజాగా ప్రముఖ మోడల్ పాలా.. దర్శకుడు సాజిద్ ఖాన్ పై పలు ఆరోపణలు గుప్పించింది. ఈమేరకు సోషల్ మీడియాలో ‘ప్రజాస్వామ్యం చనిపోవడానికి ముందు.. భావాల్ని వ్యక్తపరిచే స్వేచ్ఛను నిషేధించడానికి ముందే.. నాకు జరిగిన ఘోరాన్ని బయటపెట్టాలి అనిపించింది’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది.
‘మీ టూ ఉద్యమం’ సమయంలో తాను ధైర్యం తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించలేదని పేర్కొంది. తాను ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ లేకుండా వచ్చానని.. తన సంపాదనతోనే తన కుటుంబాన్ని పోషించేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన తల్లిదండ్రులు తనతో లేరని.. ఒకరిపై ఆధారపడకుండానే సంపాదిస్తున్నానని అందుకే ఇప్పుడు నిజాన్ని నిర్భయంగా చెబుతున్నానని చెప్పింది.
తన 17ఏళ్ల వయస్సులో దర్శకుడు సాజిద్ ఖాన్ తనను లైంగిక వేధింపులకు గురిచేశారని చెప్పింది. తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడని.. తనను ముట్టుకునే ప్రయత్నం చేశాడని.. హౌజ్ ఫుల్ మూవీలో అవకాశం కావాలంటే తన ఒంటిపై దుస్తులు విప్పాలని అడిగినట్లు ఆమె ఆరోపించడం సంచలనంగా మారింది.
Also Read: వకీల్ సాబ్ కి గ్రీన్ సిగ్నల్.. ఫ్యాన్స్ కి ఒరిగేదేమీ లేదు !
దర్శకుడు సాజిద్ ఖాన్ చర్యలతో తాను మానసికంగా కుంగిపోయాయని.. అయితే తన లక్ష్యాన్ని మరిచిపోలేదని తెలిపింది. ఇతరుల ఆశలను సొమ్ము చేసుకొని వేధింపులకు గురిచేసే వారికి తప్పకుండా శిక్షపడాలని పాలా కోరింది. డ్రగ్ కేసు.. సుశాంత్ ఆత్మహత్య.. లైంగిక వేధింపులు.. ఇలా బాలీవుడ్లోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండటంతో సినీప్రియులు అవాక్కవుతున్నారు.
Comments are closed.