Prabhas Vintage King: “బాహుబలి” సినిమా తర్వాత నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కేవలం భారీ బడ్జెట్ సినిమాలో మాత్రమే చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాధేశ్యాం, ఆది పురుష్, వంటి డిజాస్టర్ ల తర్వాత ప్రభాస్ ఇప్పుడు సలార్ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా కోసం అభిమానులు భారీ స్థాయిలో ఎదురుచూస్తున్నారు. ఒకవైపు ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలో మాత్రమే కాక మరోవైపు ప్రభాస్ ఒక చిన్న డైరెక్టర్ తో సినిమా కూడా ఒప్పుకున్నారు. మారుతి మరియు ప్రభాస్ కాంబినేషన్లో ఒక సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ మధ్యనే పక్కా కమర్షియల్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న మారుతి వంటి చిన్న డైరెక్టర్ ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరోని హ్యాండిల్స్ చేయగలరా లేదా అని అభిమానులలో ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. అయితే అవన్నీటినీ పక్కన పెట్టి మారుతి సినిమా షూటింగ్ పై బాగానే ఫోకస్ చేస్తున్నారు. గతంలో ఈ సినిమాకి రాజా డీలక్స్ అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ఇప్పుడు ఈ సినిమా కోసం వేరే టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కోసం చిత్ర బృందం వింటేజ్ కింగ్ అనే ఆసక్తికరమైన టైటిల్ను లాక్ చేయబోతున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. హారర్ కామెడీ సినిమాగా విడుదల కాబోతున్న ఈ సినిమా కథ మొత్తం ఒక థియేటర్ చుట్టూ తిరగబోతుందట.
సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ప్రభాస్ తాత పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. సంజయ్ దత్ మరియు జరిగిన వాహబ్ లు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. మాళవిక మోహన్ మరియు రిద్దీ కుమార్ లు కూడా ఈ సినిమాలో హీరోయిన్లుగా కనిపించబోతున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాని మంచి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. పాన్ ఇండియా సినిమాలతో సూపర్ హిట్ అందుకోలేకపోయినా ప్రభాస్ ఈ సినిమాతో విజయాన్ని సాధిస్తారో లేదో వేచి చూడాలి.