Prabhas Marriage: సినిమా ఇండస్ట్రీలో సక్సెసులనేవి అంత ఈజీగా రావు…ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకున్న తర్వాతే సక్సెస్ లు వరిస్తాయి. ఇక ఇలాంటి క్రమంలోనే కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సినిమాలను మాత్రమే చేస్తున్నాడు. తనతో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క దర్శకుడు ఆసక్తి చూపిస్తున్నాడు అంటే ఆయన ఏ రేంజ్ సక్సెస్ ని సాధించాడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలతో మరో మెట్టు పైకి ఎక్కబోతున్నట్టుగా తెలుస్తుంది. ఫౌజీ, స్పిరిట్ లాంటి సినిమాలు ఆయన రేంజ్ ను మార్చబోతున్నాయి.
ప్రభాస్ సినిమాలా పరంగా ముందుకు దూసుకెళ్తున్నప్పటికి పర్సనల్ విషయాల్లో మాత్రం చాలా వరకు వెనుకబడిపోయాడని చాలామంది చెబుతున్నారు. తన తోటి హీరోలందరు పెళ్లి చేసుకొని పిల్లల్ని కట్టుంటే ప్రభాస్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకపోవడం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా నిలిచిపోవడం అనేది ప్రతి ఒక్కరిని కలవరపెడుతుంది.
తన కుటుంబ సభ్యులతో సహా ప్రతి ఒక్కరు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అంటూ అతన్ని అడుగుతున్నారు. నిజానికి తన దగ్గర కూడా ఆ విషయానికి సమాధానం లేదంటూ ప్రభాస్ తప్పించుకుంటున్నాడు. సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుంది అంటూ సిచువేషన్ ను దాటవేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా కొంతమంది హీరోయిన్లు సైతం ప్రభాస్ ఇష్టపడితే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఓపెన్ గా చెప్పేస్తున్నారు.
జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి ఫరీయా అబ్దుల్లా…ఆమె గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ ఫన్నీగా ఒక ఆన్సర్ ఇచ్చింది. మరి నిజంగానే ఆమె ప్రభాస్ ఓకే అంటే పెళ్లి చేసుకుంటుందా? లేదా అనే విషయం పక్కన పెడితే ప్రభాస్ కి అంత మంచి ఫాలోయింగ్ అంత మంచి క్రేజ్ ఉన్నప్పుడు ఎందుకని పెళ్లి చేసుకోవడానికి నెగ్లెక్ట్ చేస్తున్నాడు. అంటూ ఇండస్ట్రీ లో చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి…