Kannappa : కెరియర్ మొదట్లో విలన్ వేషాలు వేసినా మోహన్ బాబు (మోహన్ Babu) ఆ తర్వాత హీరోగా మారి మంచి విజయాలు అందుకున్నాడు…ఇక తన వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు (Vishnu), మనోజ్ (Manoj) లు సైతం హీరోలుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ వాళ్లు అనుకున్న రేంజ్ లో సక్సెస్ లను సాధించలేకపోయారు. ఇక దాంతో ఇప్పుడు భారీ బడ్జెట్ తో మంచు విష్ణు కన్నప్ప సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మరి ఈ సినిమాలో తను కన్నప్ప పాత్రను పోషిస్తున్నప్పటికి రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర వహిస్తున్నాడు అంటూ చాలా రోజుల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక కొద్దిసేపటి క్రితమే కన్నప్ప సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించబోతున్నాడనే విషయం అయితే మనకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఈ పోస్టర్ లో ‘ప్రళయకాల రుద్రుడు త్రికాల మార్గదర్శకుడు శివజ్ఞాపరిపాలకుడు’ అంటూ కొన్ని వాక్యాలు అయితే రాశారు. దాంతో ఆయన నంది పాత్రను పోషిస్తున్నాడు క్యారెక్టర్ పేరు మాత్రం రుద్ర అనేది కూడా ఈ వాక్యాల ద్వారా చెప్పకనే చెప్పారు…ఇక మొత్తానికైతే ప్రభాస్ లుక్ ను చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు.ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందంటూ సినిమా మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ లుక్ అయితే అందరిని ఆకర్షించింది. మరి అదే విధంగా తను ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని అందుకుంటాడు. అలాగే మంచు విష్ణుకు ఎలాంటి సక్సెస్ ని కట్టబెట్టబోతున్నాడనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక కన్నప్ప సినిమా ఏప్రిల్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపధ్యం లో ఇప్పటివరకు ఈ సినిమా మీద పెద్దగా బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. కానీ ఈ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి కన్నప్ప సినిమా కోసం ఎదురుచూసే వాళ్ళ సంఖ్య కూడా భారీ రేంజ్ లో పెరిగిపోయిందనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కాబట్టి ఈ సినిమాతో మంచు విష్ణు సూపర్ సక్సెస్ సాధిస్తేనే ఆయన కెరియర్ అనేది స్టేబుల్ గా నిలబడుతుంది. లేకపోతే మాత్రం ఫేడ్ అవుట్ అయిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడవచ్చు…
ఇక ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూసిన ప్రతి ఒక్కరికి కన్నప్ప సినిమా మీద మంచి అంచనాలు పెరిగాయి..దాంతో విష్ణు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ ఇందులో కనిపించేది ఐదు నిమిషాలే అయినప్పటికి ఆయన కోసమే సినిమాకు వచ్చే వారి సంఖ్య కోట్లల్లో ఉంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…