Fauji Look: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం ‘రాజా సాబ్'(The Rajasaab) తో పాటు హను రాఘవపూడి తో ‘ఫౌజీ’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సుమారుగా నెల రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ప్రభాస్ పై, అలాగే హీరోయిన్ ఇమాన్వి పై కీలకమైన సన్నివేశాలను ఈ మూడు షెడ్యూల్స్ లో చిత్రీకరించారు. ఈ ఏడాదిలోనే షూటింగ్ ని పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారు కానీ, అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ప్రస్తుతానికి అయితే ‘రాజా సాబ్’ మూవీ షూటింగ్ ని పూర్తి చేయడం పై ఫోకస్ పెట్టాడు ప్రభాస్. ఆయనకు సంబంధించి మరో నెల రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉంది. ఈ విషయం కాస్త పక్కన పెడితే ‘ఫౌజీ'(Fauji Movie) మూవీ షూటింగ్ సమయంలో ప్రభాస్ కి సంబంధించిన ఒక ఫోటో లీకై బాగా వైరల్ అయ్యింది.
Also Read: ఓపెనింగ్స్ లో ‘కుబేర’ కి దరిదాపుల్లో రాలేకపోయిన ‘కన్నప్ప’..ప్రభాస్ కూడా కాపాడలేకపోయాడుగా!
ఈ ఫొటోలో ప్రభాస్ పాత కాలం దుస్తులు వేసుకొని, పొడవాటి జుట్టు తో కనిపించాడు. ప్రభాస్ లుక్స్ ని చూసి ఆయన అభిమానులు షాక్ కి గురయ్యారు. చూస్తుంటే ప్రభాస్ మరోసారి పూర్తి స్థాయి లవ్ స్టోరీ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ప్రభాస్ లవ్ స్టోరీ లో చేయడం చాలా రిస్క్ అనే చెప్పాలి. పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ కి ప్రస్తుతం బిగ్గెస్ట్ యాక్షన్ హీరో గా ఒక ముద్ర పడిపోయింది. ఆ ఇమేజ్ కి తగ్గట్టు లవ్ స్టోరీ హ్యాండిల్ చేయకపోత రాధే శ్యామ్ లాంటి డిజాస్టర్ ఫ్లాప్స్ వస్తాయి. ప్రభాస్ కి మొదటి నుండి ఇలాంటి మాస్ ఇమేజ్ ఉంది. అప్పట్లో పీక్ రేంజ్ మాస్ ఇమేజ్ ఉన్న సమయంలోనే ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లాంటి లవ్ స్టోరీస్ చేసి భారీ హిట్స్ ని అందుకున్నాడు. అలాంటి సినిమాలు మళ్ళీ ప్లాన్ చేస్తే కచ్చితంగా హిట్ కొడుతాడు.
హను రాఘవపూడి(Hanu Raghavapudi) మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ ని తెరకెక్కించడం లో నేర్పరి. కాబట్టి ఈ సినిమా కచ్చితంగా బాగా తీస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక రాజా సాబ్ విషయానికి వస్తే రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 5 న విడుదల కాబోతున్న ఈ సినిమా పై ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఆరంభం లో మారుతీ తో ప్రభాస్ సినిమా చేయబోతున్నాడు అనగానే అభిమానులు ఫైర్ అయ్యారు. ప్రభాస్ రేంజ్ కి ఇలాంటి చిన్న డైరెక్టర్స్ తో సినిమాలు చేయడం ఏంటి?, ఈ సినిమాని ఆపేయాలి అంటూ సోషల్ మీడియా లో డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు అదే సినిమా టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ చిత్రాల్లో ఒకటిగా నిల్చింది.