Fauji Prabhas Latest Look: ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం చేస్తున్న వరుస సినిమాల్లో ఒకటి హను రాఘవపూడి(Hanu Raghavapudi) తో చేస్తున్న ‘ఫౌజీ'(Fauji Movie) అనే చిత్రం. పీరియాడికల్ లవ్ స్టోరీ జానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రభాస్ కి ఈ సినిమా కథ తెగ నచ్చేయడం తో ఆయన రాజా సాబ్ కంటే ఎక్కువగా ఈ చిత్రం మీదనే ఫోకస్ పెట్టాడు. డైరెక్టర్ హను రాఘవపూడి అడిగినన్ని డేట్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేసాడు. ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లోనే బిజీ గా ఉన్నాడు. అయితే షూటింగ్ చిత్రీకరణ సమయం లో ప్రభాస్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పటికే చాలా వారుకు లీక్ అయ్యాయి. ఆయన లుక్స్ ని చూసిన అభిమానులు వింటేజ్ ప్రభాస్ ని చూసినట్టుగా ఉందని కామెంట్స్ కూడా చేశారు. నేడు కాసేపటి క్రితమే ప్రభాస్ కి సంబంధించిన మరో లుక్ సోషల్ మీడియా లో లీక్ అయ్యింది.
Also Read: బుద్ధి లేదా నీకు అంటూ రిపోర్టర్ పై నాగార్జున ఫైర్.. వీడియో వైరల్!
ఇందులో ప్రభాస్ మిలటరీ లుక్ లో కనిపించాడు. చాలా కొత్తగా ఉన్నాడు, లుక్స్ కూడా వేరే లెవెల్ లో ఉన్నాయి. అయితే ప్రభాస్ ఇందులో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నాడని ఈ సినిమా షూటింగ్ మొదలైన రోజే అందరికీ తెలుసు. ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కి, పాకిస్తానీ అమ్మాయికి మధ్య రజాకార్ మూవ్మెంట్ జరుగుతున్నా సమయం లో జరిగిన లవ్ స్టోరీ ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాన్సెప్ట్ వినేందుకే చాలా కొత్తగా ఉంది కదూ. ఇలాంటి ఆలోచన తో ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒక్క సినిమా కూడా రాలేదు. డైరెక్టర్ హను రాఘవపూడి తడపడకుండా సరిగ్గా ఈ సినిమాని తీస్తే మాత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త అద్భుతాలు జరుగుతాయి. ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ఎన్నో రికార్డ్స్ ఈ సినిమా దెబ్బకు కాల గర్భం లో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి అయితే ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల అవుతుంది. లేదంటే 2027 లోనే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇకపోతే ప్రభాస్ నటించిన రాజా సాబ్ చిత్రం డిసెంబర్ 5 నుండి పక్కకి జరిగి జనవరి 9 కి వాయిదా పడింది.