https://oktelugu.com/

Kalki 2898 AD OTT: ఓటీటీలో ప్రభాస్ కల్కి 2898 AD… కొత్తగా మరికొన్ని సీన్స్, ఫ్యాన్స్ కిక్ ఇచ్చే డిటైల్స్!

ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి 2898 AD ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఇందులో ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి ఉంది. ఓటీటీ వెర్షన్ కి అదనపు సన్నివేశాలు జోడించారట. ఆ సన్నివేశాలు ఏమిటో చూద్దాం...

Written By:
  • S Reddy
  • , Updated On : August 22, 2024 / 06:14 PM IST

    Kalki 2898 AD OTT

    Follow us on

    Kalki 2898 AD OTT: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ కల్కి 2898 ఏడీ ‘. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. జూన్ 27న ధియేటర్స్ లోకి వచ్చిన కల్కి 2898 ఏడీ , బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసింది. ప్రీమియర్ షోల నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా కల్కి 2898 ఏడీ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.

    ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటాని వంటి స్టార్ కాస్ట్ తో నాగ అశ్విన్ కల్కి 2898 ఏడీ చిత్రాన్ని రూపొందించాడు. ఈ మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అద్భుతమైన గ్రాఫిక్స్ తో నిర్మితమైన ఈ విజువల్ వండర్ ఆడియన్స్ కి కొత్త అనుభూతి పంచింది. ఈ సూపర్ హిట్ మూవీ ఎప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తుందా అని ఓటిటీ ప్రియులు ఎదురు చూశారు.

    కల్కి 2898 ఏడీ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఓవర్సీస్ ఆడియన్స్ నుండి విశేష స్పందన వచ్చింది. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ దుమ్ముదులపగా… కల్కి సినిమా డిజిటల్ హక్కులు కోసం ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయి. భారీ మొత్తం చెల్లించి అమెజాన్ ప్రైమ్ దక్షిణాది భాషల స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఇక హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కాగా ఆగస్టు 22 నుంచి అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లో కల్కి 2898 ఏడీ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

    మరొక విశేషం ఏమిటంటే… ధియేటర్స్ లో సెన్సార్ కారణంగా కట్ చేసినటువంటి కొన్ని సీన్స్ ఇప్పుడు యాడ్ చేశారని తెలుస్తుంది. ఆ సన్నివేశాలు ఏమిటో మూవీ చూస్తే కానీ తెలియదు. ఈ క్రమంలో ఓటీటీలో కల్కి చిత్రానికి మరింత డిమాండ్ పెరిగింది. ఓటీటీ లవర్స్ ప్రభాస్ మూవీ కోసం ఎగబడుతున్నారు. కాగా ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించారు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందించారు. రాజమౌళి, ఆర్జీవీ, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ కేమియో రోల్స్ లో తళుక్కున మెరిశారు.

    కల్కి 2 లోనే అసలు కథ ఉంది అంటున్నాడు దర్శకుడు. కల్కి పార్ట్ 2 షూటింగ్ కొంత మేర జరుపుకుంది. అయితే కల్కి 2 రావడానికి సమయం పడుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించాడు.