Indra: ‘ఇంద్ర’ 175 రోజుల వేడుకల్లో ఇన్ని సంఘటనలు జరిగాయా?..చిరంజీవి ముందే ఎన్టీఆర్ పై ప్రకాష్ రాజ్ సెటైర్లు!

ఇండస్ట్రీ లో తాను పోషించలేని పాత్ర అంటూ ఏది లేదని ఈ సినిమాతో మరోసారి ఆయన నిరూపించుకున్నాడు. ఇకపోతే ఈ చిత్రం అప్పట్లో 122 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకోగా, 32 కేంద్రాలలో 175 రోజులు పూర్తి చేసుకుంది.

Written By: Vicky, Updated On : August 22, 2024 6:08 pm

Indra

Follow us on

Indra Re Release: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులకు కూడా ఎంతో ఇష్టమైన చిత్రం ‘ఇంద్ర’. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సునామీని అంత తేలికగా ఎవరు మాత్రం మర్చిపోగలరు. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి, ఆల్ టైం రికార్డు ని నెలకొల్పడమే కాకుండా, కొన్ని ప్రాంతాలలో సరికొత్త బెంచ్ మార్క్ ని కూడా ఏర్పాటు చేసింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభ సమయంలో చిరంజీవి ఇలాంటి ఫ్యాక్షన్ సినిమాలకు సెట్ అవ్వడేమో, ఆయన కెరీర్ లో పెద్ద ఫ్లాప్ అవుతుంది అని కొంతమంది సినీ విశ్లేషకులు కామెంట్స్ చేశారట. ఎవరైతే అలా కామెంట్స్ చేసారో, వారిచేతనే శబాష్ అనిపించుకున్నాడు మెగాస్టార్.

ఇండస్ట్రీ లో తాను పోషించలేని పాత్ర అంటూ ఏది లేదని ఈ సినిమాతో మరోసారి ఆయన నిరూపించుకున్నాడు. ఇకపోతే ఈ చిత్రం అప్పట్లో 122 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకోగా, 32 కేంద్రాలలో 175 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అప్పట్లో నిర్మాత అశ్వినీదత్ 175 రోజుల వేడుకను అంగరంగ వైభవంగా జరిపించాడు. ఈ ఈవెంట్ కి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అలాగే ఉదయ్ కిరణ్, శ్రీకాంత్, రామ్ చరణ్ తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఉదయ్ కిరణ్ ఈ ఈవెంట్ లో పాల్గొనే కొద్దిరోజుల ముందే చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత తో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఈ ఈవెంట్ లో ఆయన ఎమోషనల్ గా చిరంజీవిని పొగుడుతూ మాట్లాడిన మాటలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. అలాగే ఈ ఈవెంట్ లో నటుడు ప్రకాష్ రాజ్ ప్రసంగం అప్పట్లో పెద్ద వివాదానికి దారి తీసింది. ఆయన మాట్లాడుతూ ‘ఈమధ్య కొంతమంది హీరోలు ఒకటి రెండు హిట్లు కొట్టగానే, అన్నయ్య తర్వాత మేమే అని చెప్పుకొని తిరుగుతున్నారు. ఒక ట్యూబ్ లైట్ చుట్టూ చాలా పురుగులు తిరుగుతూ ఉంటాయి. అన్నయ్య చిరంజీవి ట్యూబ్ లైట్ అయితే, ఆయన మీద కామెంట్స్ చేసేవారు పురుగులు లాంటి వారు’ అంటూ ఆయన వ్యాఖ్యానించాడు. ఇది కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అంటూ అప్పట్లో నందమూరి అభిమానులు ప్రకాష్ రాజ్ పై తీవ్రమైన విమర్శలు చేసారు.

ఆరోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఆది, సింహాద్రి వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తో మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకొని చిరంజీవి కి కొంతకాలం వరకు పోటీ ఇచ్చాడు. అందుకే ఎన్టీఆర్ ని ఉద్దేశించి మాట్లాడినట్టుగా అవి బయటకి వెళ్లాయి. ఇకపోతే ఈ ఈవెంట్ లో మరో హైలైట్ గా నిల్చింది, అభిమానులు మొత్తం పవన్ కళ్యాణ్ స్లోగన్స్ తో సభా ప్రాంగణం ని దద్దరిల్లిపోయేలా చెయ్యడమే. చిరంజీవి కూడా తన తమ్ముడికి వచ్చిన రెస్పాన్స్ ని చూసి ఎంతో మురిసిపోయాడు, ఈరోజు కళ్యాణ్ ఇక్కడ ఉండుంటే బాగుండేది అని ఆయన ఎమోషనల్ గా మాట్లాడిన మాటలను అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.