Prabhas Spirit Movie : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) ప్రస్తుతం రాజా సాబ్ మూవీ డబ్బింగ్ వర్క్ లో బిజీ గా ఉన్నాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి టీజర్, థియేట్రికల్ ట్రైలర్ వచ్చింది. ఈ రెండిటికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ, రీసెంట్ గా విడుదలైన పాటకు మాత్రం రెస్పాన్స్ అనుకున్నంత రేంజ్ లో రాలేదు. తమన్ చాలా అవుట్ డేటెడ్ మ్యూజిక్ ఇచ్చాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. స్వయంగా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ పాటకు నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ప్రభాస్ తదుపరి చిత్రం ‘స్పిరిట్'(Spirit Movie) మూవీ పూజా కార్యక్రమాలు జరిగాయి.
ప్రస్తుతం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. రేపటి నుండి ప్రభాస్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటాడని అంటున్నారు. అయితే ముందుగా ఆయన పై జైలు సన్నివేశాలు తెరకెక్కిస్తారని తెలుస్తుంది. జైలు లో ప్రభాస్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను రేపటి నుండి తెరకెక్కిస్తారట. అక్టోబర్ నెలలో ఈ సినిమాకు సంబంధించి ఒక చిన్న ఆడియో టీజర్ విడుదలైంది. అందులో జైలు బ్యాక్ డ్రాప్ లో సన్నివేశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఈ సన్నివేశాలు సందీప్ వంగ మార్క్ బోల్డ్ మేకింగ్ తో తీస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదూ. ఇక స్క్రీన్ పై ఎలా ఉంటుందో. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా త్రిప్తి దిమిరి నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ విలన్ గా చేస్తున్నాడు. ఇక ఇందులో మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ కి తండ్రి క్యారక్టర్ చేస్తున్నాడని టాక్ వచ్చింది కానీ, అందులో ఎలాంటి నిజం లేదని డైరెక్టర్ సందీప్ వంగ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. కానీ పూజ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధి గా రావడాన్ని చూసి సందీప్ వంగ ఏమైనా సినిమాలో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చిత్రాన్ని 2027 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.