Krishna Vamsi: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో క్రియేటివ్ డైరెక్టర్ అనగానే మనకు కృష్ణవంశీ మాత్రమే గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో చేసిన సినిమాలకు అంత గొప్ప పేరైతే ఉంది. ఆయన సినిమాల్లో హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు…ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఒకప్పుడు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉండేది… కానీ కెరియర్ స్టార్టింగ్ లో కృష్ణవంశీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినప్పటికి దానికంటే ముందు ఆయన ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు ఐదు రోజులకు ఒకసారి భోజనం చేసేవాడట. ఇక అదే క్రమంలో ఆయన ఒకరోజు బ్రహ్మాజీ ని కలిసి మాట్లాడుతున్నాడు. అప్పటికే కృష్ణవంశీ అన్నం తిని ఐదు రోజులు అయిందట. బాడీలో ఓపిక లేకపోయినా కూడా తను ఫుట్ పాత్ మీద నిల్చొని ఉన్నాడట. సరిగ్గా అదే సమయానికి బ్రహ్మాజీ భోజనం చేద్దాం రా అని అన్నాడట…నిజానికి కృష్ణవంశీ 5 రోజుల కొకసారి ఆకలితో ఉన్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి భోజనం చేద్దాం అని చెప్పినప్పుడు కృష్ణవంశీ మాత్రం వద్దు నేను ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్న వాడొచ్చాక తింటాను అని తప్పించుకొని తిరిగేవాడట…
ఇక ఇప్పుడున్న పరిస్థితిలో బ్రహ్మాజీ తిందాం రా అనేసరికి మాత్రం నేను రాను అని చెప్పలేకపోయాడట… దాంతో భోజనం చేసి విని రుణం నేను ఎలా తీర్చుకోవాలని అనుకున్నాడట… మొత్తానికైతే బ్రహ్మాజీ అన్నం పెట్టించాడనే దానికి కృతజ్ఞతగా తను చేసిన సినిమాలన్నింటిలో బ్రహ్మాజీ కి ఒక కీలకమైన పాత్రనైతే ఇస్తూ వచ్చాడు.
ఇక అలాగే బ్రహ్మాజీని హీరోగా పెట్టి సింధూరం అనే సినిమా చేశాడు. మొత్తానికైతే కృష్ణవంశీ బ్రహ్మాజీ యొక్క కృతజ్ఞతను అలా తీర్చుకున్నాడు అంటూ చాలా సందర్భాల్లో బ్రహ్మాజీ కూడా చెప్పడం విశేషం… మొత్తానికైతే కృష్ణవంశీ ఇప్పుడు చేస్తున్న సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. అయినప్పటికి తను ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం…
రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ‘రంగ మార్తాండ’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాతో కృష్ణవంశీ మరోసారి కంబ్యాక్ ఇచ్చాడు అంటూ చాలామంది కామెంట్లు చేశారు. ఇక ఇప్పుడు మరో యూత్ ఫుల్ సబ్జెక్టుని రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తొందరలోనే ఈ సినిమా కూడా పట్టాలెక్కే అవకాశాలైతే ఉన్నాయి…