Tollywood: సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒకసారి ఒక సినిమా చేసి సక్సెస్ సాధించిన కాంబినేషన్ తో పాటు ఇప్పటివరకు చేయని కొంతమంది స్టార్ హీరోలు, డైరెక్టర్ల కాంబినేషన్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ కాంబినేషన్స్ ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం…
రామ్ చరణ్ – సందీప్ రెడ్డివంగ
వీళ్లిద్దరి కాంబినేషన్లో ఒక పర్ఫెక్ట్ మాస్ సినిమా పడితే సినిమా ఎక్కడికి వెళ్ళిపోతోంది అంటూ చాలామంది జనాలు సైతం కామెంట్ చేస్తున్నారు. నిజానికి సందీప్ రెడ్డివంగా బోల్ట్ సినిమాలను తెరకెక్కిస్తాడు. రామ్ చరణ్ మాత్రం ఒక డీసెంట్ పెర్ఫార్మెన్స్ ని ఇస్తాడు. రామ్ చరణ్ చేసే సినిమాలా ఫార్మాట్ లోకి సందీప్ రెడ్డివంగా వచ్చిన, లేదంటే సందీప్ ఫార్మాట్ లోకి రాంచరణ్ వెళ్లినా కూడా వీళ్ళ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందని చాలా మంది సినిమా మేధావులు సైతం చెబుతున్నారు…
మహేష్ బాబు – లోకేష్ కనకరాజు
లోకేష్ కనక రాజ్ కి ఈ మధ్య ఫ్లాప్ సినిమాలు వచ్చినప్పటికి తన మేకింగ్ స్టైల్ చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కి లేని మేకింగ్ వాల్యూస్ తనకు ఉన్నాయి. ఏ సీన్ ఎలా తీస్తే ప్రేక్షకుడికి నచ్చుతోంది. దాన్ని ఎలా తెరకెక్కించాలనేది అతనికి బాగా తెలుసు… ముఖ్యంగా అతను సీజీ షాట్స్ ను ఎక్కువగా వాడి సినిమా మీద ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తాడు. కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ అద్భుతంగా తెరకెక్కించగలిగే సత్తా అతనికి ఉంది. అందువల్ల మహేష్ బాబుకి ఒక యాక్షన్ సినిమా లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో పడితే ఆ సినిమా లెవల్ వేరేలా ఉంటుందని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు…
అల్లు అర్జున్ – రాజమౌళి
రాజమౌళి ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలతో సినిమాలు చేసినప్పటికి అల్లు అర్జున్ తో మాత్రం సినిమా చేయలేదు. కారణం ఏదైనా కూడా వీళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం దానికి భారీ క్రేజ్ దక్కుతోంది…
ప్రభాస్ – సుకుమార్
ఇక సుకుమార్ లవ్ స్టోరీస్ కి అలాగే రా అండ్ రాస్టిక్ సినిమాలను కూడా చాలా బాగా తెరకెక్కించగలరనే గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రభాస్ లాంటి మాస్ హీరోకి సుకుమార్ తన స్టైల్ ఆఫ్ రైటింగ్ తో ఒక గొప్ప కథని రాసి దానిని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలిగితే మాత్రం బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయంటూ ప్రభాస్ అభిమానులతో పాటు సుకుమార్ అభిమానులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…