https://oktelugu.com/

Kannappa: కన్నప్పలో ప్రభాస్ శివుడు కాదు.. ఆయన చేస్తున్న పాత్ర ఏమిటో తెలుసా? ఏ స్టార్ టచ్ చేయనిది!

అయితే వాళ్ళు నిరాశకు తప్పదని లేటెస్ట్ టాక్. కన్నప్ప మూవీలో ప్రభాస్ చేస్తున్న పాత్ర శివుడు కాదంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆ పాత్రను అక్షయ్ కుమార్ చేస్తున్నాడట.

Written By:
  • S Reddy
  • , Updated On : April 15, 2024 / 10:34 AM IST

    Prabhas is not Shiva in Kannappa

    Follow us on

    Kannappa: ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీ. కాగా మంచు విష్ణు చిత్రంలో ఆయన గెస్ట్ రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న కన్నప్పలో ప్రభాస్ శివుడిగా కనిపిస్తాడనే ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తిగా ఉన్నారు. శివుడి పాత్రలో ప్రభాస్ నట విశ్వరూపం చూడాలని ఆశపడుతున్నారు. అయితే వాళ్ళు నిరాశకు తప్పదని లేటెస్ట్ టాక్. కన్నప్ప మూవీలో ప్రభాస్ చేస్తున్న పాత్ర శివుడు కాదంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆ పాత్రను అక్షయ్ కుమార్ చేస్తున్నాడట.

    మరి ప్రభాస్ చేస్తున్న పాత్ర ఏది అనగా… నందీశ్వరుడు అట. శివుని వాహనమైన నందీశ్వరుడు పాత్ర ఆయన చేస్తున్నారట. నిజానికి స్టార్స్ ఎవరు నందీశ్వరుడు పాత్ర చేసిన దాఖలాలు లేవు. గతంలో ఒకరిద్దరు చేసినా వారు పెద్ద స్టార్స్ కాదు. మరి ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ నందీశ్వరుడిగా కనిపించడం ఏమిటనే టాక్ నడుస్తుంది. గెస్ట్ రోల్ మాత్రమే కాబట్టి ప్రభాస్ ఓ సన్నివేశంలో నందీశ్వరుడిగా పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం కలదు.

    దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి కన్నప్ప మూవీలో నటించేందుకు ప్రభాస్ ఆసక్తి చూపలేదట. అతికష్టం మీద మంచు విష్ణు ఒప్పించాడని సమాచారం. కాగా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కెరీర్లో అతిపెద్ద హిట్ గా ఉంది భక్త కన్నప్ప. ప్రభాస్ ఈ చిత్రం రీమేక్ చేస్తే చూడాలని ఉందని కృష్ణంరాజు పలుమార్లు అన్నారు. ప్రభాస్ మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు.

    కన్నప్ప మూవీలో వివిధ పరిశ్రమలకు చెందిన స్టార్స్ నటిస్తున్నారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్, బ్రహ్మానందం నటిస్తున్నారు. అధికభాగం విశేషాల్లో చిత్రీకరిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ కల్కి 2829 AD , రాజా సాబ్ చిత్రాల్లో నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన కల్కి సమ్మర్ కానుకగా మే 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వాయిదా పడే అవకాశం కలదంటున్నారు. అలాగే మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ చేస్తున్నాడు. ఇది కామెడీ హారర్ అనే ప్రచారం జరుగుతుంది.