Bayyaram Steel Plant: తెలంగాణలో ఖనిజ నిక్షేపాలకు కొదవలేదు. దీంతో ఎన్నో ఏళ్లుగా ప్రజలు కోరుతున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో బయ్యారం గనుల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతోంది. పరిశ్రమను ప్రైవేటు పరం చేయాలని కుట్ర చేస్తోందని చెబుతోంది. దీంతో రెండు ప్రభుత్వాల మధ్య పొరపొచ్చాలు వస్తున్నాయి. బయ్యారం గనుల వినియోగానికి చర్యలు తీసుకోవడంలో ఎందుకు తాత్సారం చేస్తుందని ప్రశ్నిస్తోంది.
బయ్యారం గనుల సద్వినియోగం చేసుకోవడానికి అక్కడ స్టీల్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నా కేంద్రం రోజురోజుకు వాయిదా వేస్తోంది. అయితే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నంలోనే ఇలా చేస్తుందనే ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. దీంతో బయ్యారం గనుల కోసం కేంద్రం ఎందుకు ముందుకు రావడం లేదని ఆరా తీస్తోంది.
ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతున్నా కేంద్రం మాత్రం పెడచెవిన పెడుతోంది. ఇటీవల కాలంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య విభేదాలు రావడంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలో బయ్యారం గనులను తవ్వి అక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఆదాయంతో పాటు ఉద్యోగావకాశాలు సైతం పెరిగే అవకాశం ఉంటుంది.
Also Read: ఆ ఐపీఎస్ కు కేసీఆర్ ఎందుకు పోస్టింగ్ ఇవ్వడం లేదు.. తెరవెనుక కథేంటి?
బయ్యారం గనుల తవ్వకం చేపట్టాలనే డిమాండ్ ఈనాటిది కాదు ఎప్పటి నుంచో ఉంది. 1953 నుంచే ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ విషయం తెరపైకి రావడంతో కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు. మొత్తానికి బయ్యారం గనుల వ్యవహారం రగడ రేపుతోంది.
కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుని బయ్యారంలో స్టీల్ పరిశ్రమ నెలకొల్పి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరుతున్నారు. దీంతో కొంతైనా నిరుద్యోగిత సమస్య తీరే అవకాశం ఉంది. దీనికి గాను ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది. బయ్యారం కోసం మరో ఉద్యమం చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. దీని కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవాలనే నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Also Read: ఆంధ్రా నడిబొడ్డున జగన్ కు షాకిచ్చిన పవన్ ఫ్యాన్స్.. ‘థాంక్యూ సీఎం సార్’ వైరల్