Prabhas: ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రభాస్ తొలిసారిగా హిందీ సినిమాలో నటిస్తున్నాడు. బాహుబలితో ప్యాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. బాహుబలితో ఇండియా వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ ఆదిపురుష్ తో మరిన్ని సంచలనాలు చేయనున్నాడని చెబుతున్నారు. ఇందులో హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తోంది. సీతగా ఆమె నటన కూడా సూపర్ అని ప్రశంసిస్తున్నారు. రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందే ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ బాగుందని వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా ప్రారంభమై చాలా రోజులు అయింది. కానీ నిర్మాణంలో వేగవంతం లేకపోవడంతో ప్రాజెక్టు నెమ్మదిగా చిత్రీకరణ జరుపుకుంటోంది. వచ్చే జనవరిలో విడుదల చేసేందుకు సినిమా యూనిట్ కసరత్తులు చేస్తోంది. ఈక్రమంలో ఆదిపురుష్ ఈవెంట్ వేదికపై ప్రభాస్, కృతి సనన్ ఉండగా ప్రభాస్ కు చెమట పట్టింది. దీంతో కృతి సనన్ తన పైట కొంగుతో తుడవాలని ప్రయత్నించినా ప్రభాస్ పట్టించుకోలేదు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రి ఉందని ప్రచారం సాగినా ఎందుకు కృతి సనన్ చర్యను పట్టించుకోలేదనే వాదనలు ప్రేక్షకుల నుంచి వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కృతి తన పైట కొంగు ఇవ్వబోయిన ప్రభాస్ ఎందుకు పట్టించుకోలేదు. వారి మధ్య ఏం లేదని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెబుతున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రి ఉందని ప్రచారం సాగుతున్నా అందులో నిజం లేదని వాదిస్తున్నారు. ప్రభాస్ కుర్తా పైజామా లో కూల్ గా కనిపించాడు. కృతి లెహంగా సంప్రదాయ దుస్తుల్లో మెరిసింది. దీంతో వీరిద్దరి జోడిపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ప్రభాస్, కృతి డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. కానీ వారు మాత్రం వివాహం చేసుకుంటారనే వాదన బలంగా వినిపిస్తోంది. స్టేజీపై నడవడానికి ప్రభాస్ ఇబ్బంది పడ్డాడు. స్టేజీపై చెమట బాగా పట్టడంతో సహనం కోల్పోయాడు. దీంతో ప్రభాస్ స్థితిని గమనించిన కృతి సనన్ సాయం చేయాలని చూసినా ప్రభాస్ పట్టించుకోకపోవడం గమనార్హం.

కొందరేమో ప్రభాస్, కృతి మధ్య ఏదో ఉందని ఆరా తీస్తున్నారు. మరికొందరేమో వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. దీంతో ప్రభాస్, కృతి సనన్ జంటపై అప్పుడే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పరస్పరం సంబంధం లేకుండా చెబుతున్న మాటల్లో నిజమెంతో అబద్ధమెంతో తెలియడం లేదు. వీరి మధ్య ఉండే సంబంధంపైనే చర్చించుకుంటున్నారు. దీంతో ఆదిపురుష్ ఎలాంటి బ్లాక్ బస్టర్ అవుతుందో అనే సందేహాలు వస్తున్నాయి. ప్రేక్షకుల మధ్య వస్తున్న సందేహాలకు ఎప్పుడు సమాధానం దొరుకుతుందోననే ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తానికి ఆదిపురుష్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.