Spirit: స్పిరిట్ సినిమా కోసం సందీప్ వంగ కి పూర్తి స్వేచ్ఛని ఇస్తున్న ప్రభాస్…బొమ్మ బ్లాక్ బస్టరే…

అభిమానులు ఎక్కడ కూడా నిరాశ పడకుండా ఈ సినిమాని ఒక సూపర్ సక్సెస్ సాధించే విధంగా సందీప్ దీనిని డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇలాంటి క్రమంలో ప్రభాస్ కూడా సందీప్ కి పూర్తి స్వేచ్చనిచ్చినట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : January 10, 2024 11:06 am

Spirit

Follow us on

Spirit: అనిమల్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్ తో చేసే సినిమా పైన తన పూర్తి ఫోకస్ ని పెట్టారు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా డీటైల్ గా రాసుకుంటూ ప్రభాస్ కి ఎలాంటి ఎలిమెంట్స్ అయితే నచ్చుతాయో అలాంటి ప్రతి హై ఇచ్చే మూమెంట్ ను ఈ సినిమాలో ఉండే విధంగా స్క్రిప్ట్ డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే అభిమానులు ఎక్కడ కూడా నిరాశ పడకుండా ఈ సినిమాని ఒక సూపర్ సక్సెస్ సాధించే విధంగా సందీప్ దీనిని డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇలాంటి క్రమంలో ప్రభాస్ కూడా సందీప్ కి పూర్తి స్వేచ్చనిచ్చినట్టుగా తెలుస్తుంది.ఇక ఎలాంటి సినిమానైతే అభిమానులు కోరుకుంటున్నారో అలాంటి సినిమా చేయమని ప్రభాస్ సందీప్ కి వివరించాడంట…దాంతో సందీప్ కి పూర్తి స్వేచ్ఛ దొరికిందంటూ స్క్రిప్ట్ ని చాలా వైల్డ్ గా తయారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాని ప్రభాస్ అభిమానులకి కోరుకున్నట్లు గా తీయబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నట్టు గా తెలుస్తుంది…ఇక వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా మీద భారీ రేంజ్ లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి.

ఇక ఇప్పటికే సందీప్ పాన్ ఇండియా లెవల్లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. ఇక ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లో తన స్థాయి ఏంటో ప్రూవ్ చేశాడు. అలాగే రీసెంట్ గా సలార్ సినిమాతో 700 కోట్ల వరకు కలక్షన్లను రాబట్టి తన సత్తా చాటుకున్నాడు. ఇక ఈ కాంబో లో అనిమల్ ని మించిన ఒక వైల్డ్ సినిమా అయితే రాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడనే విషయాన్ని కూడా డైరెక్టర్ ఇప్పటికే రైవిల్ చేశాడు.

ఇక ఈ సినిమాతో మరోసారి తెలుగు వాళ్ళు అందరూ గర్వంగా ఫీల్ అయ్యేలా సందీప్ వంగా ఈ సినిమా తీస్తున్నానని ఇప్పటికే అందరికి ఒక మాట కూడా ఇస్తున్నాడు… ఇక మొత్తానికి ఈ సినిమా తొందర్లోనే షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతోంది.