Prabhas : సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా తీర్చేదిద్దుకోవాలనే ప్రయత్నమైతే చేస్తుంటారు. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో కొంతమందికి సరిగ్గా యాక్టింగ్ కూడా రాదు కానీ సినిమాలు చేస్తున్న కొద్దీ వాళ్ళని వాళ్ళు మార్చుకున్న తీరు వాళ్ళను స్టార్ హీరోలుగా నిలబెడుతూ ఉంటుంది… ఇండస్ట్రీలో సక్సెస్ లు, ఫ్లాపులు అనేవి కామన్ గా వస్తూ పోతూ ఉంటాయి. మంచి సబ్జెక్ట్ తో సినిమా చేయడానికి ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగితే ఎప్పుడైనా సరే వాళ్లకు ఒక మంచి విజయమైతే వరిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు ప్రభాస్…ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇక ఎప్పుడైతే బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి వరుసగా మంచి సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తూ బాలీవుడ్ ప్రేక్షకులను సైతం తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఇక ప్రభాస్(Prabhas) రాజమౌళి (Rajamouli) డైరెక్షన్ లో చేసిన బాహుబలి(Bahubali)సినిమా ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టించింది. 1950 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక ఇప్పటివరకు ఇలాంటి సినిమా మరొకటి రాలేదని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. తనను తాను స్టార్ హీరో భారీగా ఎలివేట్ చేసుకున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం… ఇక ఈ సినిమా తర్వాత చాలా సినిమాలు చేసినప్పటికి ఆ రేంజ్ లో సక్సెసు లైతే ప్రభాస్ కి కూడా దక్కలేదు. సలార్(Salaar), కల్కి(Kalki) లాంటి సినిమాలు భారీ కలెక్షన్స్ ను రాబట్టాయి. మొత్తానికైతే ప్రస్తుతం సక్సెసుల్లో ఉన్న ప్రభాస్ రాబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక ప్రభాస్ తరచుగా అనారోగ్యం పాలవుతున్న విషయం మనకు తెలిసిందే. నిజానికి ప్రభాస్ ఆరోగ్యం చెడిపోవడానికి కూడా బాహుబలి సినిమానే కారణమనే విషయం అందరికీ తెలిసిందే.
ఇక ఈ సినిమాలో ఆయన ఓవర్ వెయిట్ అవ్వడం, ఎక్సర్ సైజ్ లు ఎక్కువగా చేయడం, హెవీగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్లే ఆయన ఆరోగ్యం అనేది ఎక్కువగా చెడిపోయింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ఎప్పుడూ ఇటలీ వెళ్లి ట్రీట్మెంట్ అయితే తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు చేస్తున్న సినిమా షూటింగ్లో కూడా ఆయన ఎక్కువగా పాల్గొనడం లేదు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మరోసారి ఆయనకు ఆరోగ్యం బాగాలేదనే వార్తలైతే వస్తున్నాయి.
ప్రస్తుతం ఫౌజీ (Fouji) సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ఆయన ఆరోగ్యం సెట్ అయిన తర్వాత కొత్త షెడ్యూల్లో మరోసారి తలుక్కున మెరువబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఇక్కడ చూసిన కూడా ప్రభాస్ సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు.ఇక రాబోయే సినిమాలు భారీ సక్సెస్ ని సాధిస్తాయా లేదా అనేది తెలియాల్సి ఉంది..