https://oktelugu.com/

ప్రభాస్ ఎపిక్ కోసం గొప్ప లెజెండరీ డైరెక్టర్!

నేషనల్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రానున్న చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకి గొప్ప లెజెండరీ డైరెక్టర్ పని చేయబోతున్నారు. వైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్ అయిన సింగీతం శ్రీనివాసరావు క్రియేటివ్ హెడ్ గా ఈ సినిమాకి పని చేస్తున్నారని వైజయంతీ మూవీస్ అధికారికంగా తెలుపుతూ ‘మేము ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల ఇది,  చివరకు నెరవేరనుంది. సింగీతం శ్రీనివాస రావు గారును మా ఎపిక్ చిత్రానికి  స్వాగతిస్తున్నందుకుగానూ  మేము ఎంతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : September 21, 2020 6:22 pm
    Follow us on

    Prabhas is a great legendary director for Epic
    నేషనల్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రానున్న చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకి గొప్ప లెజెండరీ డైరెక్టర్ పని చేయబోతున్నారు. వైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్ అయిన సింగీతం శ్రీనివాసరావు క్రియేటివ్ హెడ్ గా ఈ సినిమాకి పని చేస్తున్నారని వైజయంతీ మూవీస్ అధికారికంగా తెలుపుతూ ‘మేము ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కల ఇది,  చివరకు నెరవేరనుంది. సింగీతం శ్రీనివాస రావు గారును మా ఎపిక్ చిత్రానికి  స్వాగతిస్తున్నందుకుగానూ  మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఆయన సృజనాత్మక సూపర్ పవర్స్ ఖచ్చితంగా మాకు మార్గదర్శకంగా ఉంటాయి’ అని ట్వీట్ చేశారు వైజయంతీ మూవీస్ వారు. కేవలం కథతోనే సమాజంలో మార్పులకు శ్రీకారం చుట్టిన దిగ్ధర్శకులలో వైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అచ్చతెలుగు డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు.
    Also Read : దేత్తడి హారిక ట్విస్ట్.. బిగ్ బాస్ హౌజ్ లో స్టెప్పులేసిన గంగవ్వ
     
    ఏమైనా తెలుగు ఇండస్ట్రీలో గొప్ప డైరెక్టర్స్ చాలామంది వచ్చారు. వారిలో ఎందరో మహానుభావులు. అయితే సీనియర్ దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావుగారిది ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానమే.  ఇప్పటి జనరేషన్ కూడా  ఆయన తీసిన అప్పటి సినిమాలను చూసి షాక్ అవుతున్నారంటే దానికి కారణం.. కచ్చితంగా సింగీతం శ్రీనివాసరావు క్రియేటివిటీనే. అంత గొప్ప లెజండరీ డైరెక్టర్ ప్రభాస్ సినిమాకి పని చేస్తున్నాడు అనగానే ఈ సినిమా పై మరింత ఆసక్తి పెరిగింది.  నిజానికి ఆ రోజుల్లోనే  సింగీతంగారు ‘పుష్పక విమానం, ఆదిత్య 369, అపూర్వ సోదరులు’ లాంటి భిన్నమైన ప్రయోగాత్మక చిత్రాలు తీసి..   ఇప్పటి జనరేషన్ కి గొప్ప వైవిధ్యమైన చిత్రలను అందించారు.
     

    ఇక  సింగీతంగారు గత నాలుగు సంవత్సరాలుగా ఒక స్క్రిప్ట్ ను తయారు చేస్తున్నారు. కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్నా.. ఆయన తన పద్దతిలో ఒక సినిమా తీసే ప్రయత్నాల్లో ఉండగావైజయంతీ మూవీస్ వారు రిక్వెస్ట్ చేసి.. ఈ లెజెండరీ దర్శకుడిని తమ సినిమాలో భాగం చేశారు.  నిజానికి సింగీతం మొదట  ‘ఆదిత్య 369’ సీక్వెల్ తీయాలనుకున్నారు. అది వర్కౌట్ అవ్వలేదు. మరి ప్రభాస్ సినిమా తరువాత అయినా ఆ సినిమా చేస్తాడేమో చూడాలి.  

    Also Read : ‘నిశ్శబ్దం’ ట్రైలర్ విడుదల