Prabhas intensity revealed by villain : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాస్ (Prabhas)… ఈశ్వర్ (Eshwar) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన వర్షం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక అక్కడి నుంచి వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లను సాధిస్తూ తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చినవే కావడం విశేషం…యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్న ఆయన గొప్ప సినిమాలను తీయడానికి చాలా వరకు కష్టపడుతున్నాడు. బాహుబలి (Bahuubali) సినిమాతో పాన్ ఇండియా లో తనకంటూ ఒక మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న ప్రభాస్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు… ఇక మిర్చి (Mirchi) సినిమాలో విలన్ గా చేసిన సంపత్ రాజ్ (Sampath Raj) ప్రభాస్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని అయితే తెలియజేశాడు. ప్రభాస్ డైలాగ్ చెప్తున్నా ప్రతిసారి మెడ దగ్గర నరాలు ఉబ్బి బయటకు కనిపిస్తాయని ప్రభాస్ నటించినప్పుడు మాత్రమే అవి కనిపిస్తాయని ఆయన అంతా క్యారెక్టర్ లో లీనమైపోయి నటిస్తూ ఉంటాడని చెప్పాడు. మొత్తానికైతే ఆయన డైలాగ్ చెప్పినప్పుడు నరాలు కనిపించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ప్రభాస్ ఏది చేసినా కూడా ఒక సంచలనంగా నిలుస్తుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు…
ఇక ప్రస్తుతం ప్రభాస్(Prabhas) హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ (Fouji) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఈ మూవీతో ప్రభాస్ రెండువేల కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
మరి తను అనుకున్నట్టుగానే రాబోయే సినిమాలతో ఆయనకి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపు లభిస్తుందా? తద్వారా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ (Spirit) అనే సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఈ సినిమాలన్నింటితో ఆయన ఇండస్ట్రీలో ఉన్న పలు రికార్డులను తిరగరాస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.