Vande Bharat passenger safety : జన్మదినోత్సవాన్ని జరుపుకోడాన్ని ఎవరూ తప్పు పట్టరు. క్యాండిల్ వెలిగించి కేక్ కట్ చేయడాన్ని కూడా ఎవరూ తప్పు అనరు. కానీ రైలులో కొవ్వొత్తులు వెలిగించడం అత్యంత ప్రమాదకరం. ముఖ్యంగా వందేభారత్ లాంటి రైలులో అలాంటి పని చేయడం ఘోరాతి ఘోరం. ఖర్మ కాలి.. ఒకవేళ ఆ కొవ్వొత్తి ద్వారా మంటలు రైలు బోగిలో అంటుకుంటే పెను ప్రమాదం జరుగుతుంది.. ఆ తర్వాత ఆ రైలులో ప్రయాణించే ప్రయాణికుల ప్రాణాలు కలిసిపోతాయి. ఈ తరహా ఘటనలు ఇంతవరకు జరగకపోయినప్పటికీ.. వందే భారత్ లాంటి రైలులో కొవ్వొత్తులు వెలిగించడం అత్యంత ప్రమాదకరం.. ఇక జంబు కాశ్మీర్ వెళ్తున్న వందే భారత్ రైలును ఇటీవల దేశ ప్రధాని ప్రారంభించారు. వందే భారత రైలు అంజి ఖాడ్ వంతెన దాటుతున్న సమయంలో రాకేష్, నేహా జైస్వాల్ తమ కుమారుడు మోక్ష్ ఆరవ పుట్టినరోజు వేడుకను జరిపారు. కేక్ కట్ చేసి సంబరాన్ని జరుపుకున్నారు. అయితే కేక్ కట్ చేసే క్రమంలో కొవ్వొత్తులు వెలిగించి.. వాటిని తన కుమారుడి ద్వారా అర్పించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది..
ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు..” ప్రజలు చెల్లించిన పన్నుల ద్వారా ఆ రైలును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ రైలు మీ సొంత ప్రైవేట్ హాల్ కాదు. అలా జరుపుకోవాలి అనుకుంటే మీరు ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోండి. లేదా మీ ఇంట్లో జరుపుకోండి. అంతకి కావాలనుకుంటే విదేశాలకు.. బాగా డబ్బు ఖర్చు పెట్టి జరుపుకోండి. అంతేతప్ప ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్న ఇటువంటి రైలులో కాదు. అసలే సున్నితమైన వ్యవస్థ ఈ రైలులో ఉంటుంది. పొరపాటున ఏదైనా జరిగితే వందల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అప్పుడు అనుకున్నప్పటికి ఉపయోగం ఉండదు. ప్రాథమిక పౌర జ్ఞానం కనీసం లేకపోతే ఎలా.. మిమ్మల్ని చూస్తుంటే విద్యావంతులు మాదిరిగా కనిపిస్తున్నారు. ప్రమాదాలపై అవగాహన ఉండాలి కదా.. నిబంధనలపై స్పృహ ఉండాలి కదా.. అవి ఏమీ లేకుండా ఇలాంటి రైలులో ఎలా ప్రయాణిస్తున్నారు.. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు” అని ఆ దంపతులను ప్రశ్నిస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే రైల్వే శాఖ మంత్రిని ట్యాగ్ చేస్తూ.. ” రైలు లోపల అగ్గిపుల్ల వెలిగించడం నిషేధించారని అనుకుంటున్నామని” వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అయితే ఈ ఘటనపై రైల్వే శాఖ ఎలాంటి స్పందన వ్యక్తం చేస్తుందో చూడాల్సి ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
#WATCH | A couple, Rakesh and Neha Jaiswal from Varanasi, celebrate their son Moksh's sixth birthday inside Kashmir's first Vande Bharat express train, cutting the cake as the train reaches Anji Khad Bridge, inaugurated by PM Narendra Modi yesterday.
Rakesh Jaiswal says, "It was… pic.twitter.com/cr6b3UaI4K
— ANI (@ANI) June 7, 2025