https://oktelugu.com/

Prabhas In KGF 3: KGF 3 లో ప్రభాస్.. ఫాన్స్ కి పండగే

Prabhas In KGF 3: రాధే శ్యామ్ సినిమా తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియన్ మూవీస్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు..ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలలో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రం ‘సలార్’..KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ శెరవేగంగా సాగుతుంది..ఇప్పటికే 30 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది లో సమ్మర్ కానుకగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 28, 2022 / 06:01 PM IST
    Follow us on

    Prabhas In KGF 3: రాధే శ్యామ్ సినిమా తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియన్ మూవీస్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు..ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలలో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రం ‘సలార్’..KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్ శెరవేగంగా సాగుతుంది..ఇప్పటికే 30 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది లో సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..ఇది పక్కన పెడితే ఇటీవలే ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ KGF చాప్టర్ 2 సినిమా తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని అల్లాడించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో చనిపోయినట్టు చూపిస్తాడు ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్..కానీ ఎండ్ టైటిల్స్ పడిన తర్వాత KGF చాప్టర్ 3 కూడా ఉండబోతుంది అంటూ ఒక్క చిన్న ట్విస్ట్ ఇచ్చి ఆడియన్స్ మతి పోగొడుతాడు ప్రశాంత్ నీల్.

    Prabhas In KGF 3

    ఇంతకీ KGF చాప్టర్ 3 స్టోరీ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే..KGF పార్ట్ 3 లో ప్రభాస్ ఒక్క చిన్న గెస్ట్ రోల్ లో కనిపిస్తాడు అనే టాక్ గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతుంది..ప్రభాస్ అభిమానులు తమ హీరోని యాష్ తో మల్టీస్టార్ర్ర్ సినిమా చేస్తే చూడాలనే కోరిక ఉంది అని KGF సిరీస్ చూసినప్పటి నుండి కోరుకుంటున్న సంగతి మన అందరికి తెలిసిందే..గాడ్ లెవెల్ స్క్రీన్ ప్రెజన్స్ ఉన్న ఈ ఇద్దరు యాక్షన్ హీరోలు కలిసి ఒక్కే సినిమాలో నటిస్తే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒక్క రికార్డు కూడా మిగలదు అని, చూసే ఆడియన్స్ కి కూడా అద్భుతమైన అనుభవం కలుగుతుంది అని కేవలం అభిమానులకు మాత్రమే కాదు ప్రతి సినీ లవర్ కోరిక..కానీ పూర్తి స్థాయి మల్టీస్టార్ర్ర్ కాకపోయినా KGF చాప్టర్ 3 లో ప్రబస్ ఒక్క చిన్న గెస్ట్ రోల్ చేస్తున్నాడు అనే బజ్ ని విని అభిమానులు సంతోష పడుతున్నారు.

    Also Read: Gandhi Hospital: ఆరోగ్యశాఖ మంత్రి ఈటలనే.. గాంధీ ఆస్పత్రి చెబుతోంది రాసుకోండి..

    KGF సిరీస్ తర్వాత యాష్ ఎవరితో చెయ్యబోతున్నారు అనేది ఇప్పటికి కాంప్రిమ్ కాకపోయినా ప్రభాస్ చేతిలో మాత్రం నాలుగు సినిమాలు ఉన్నాయి..సలార్ తో పాటుగా ఆయన ఆదిపురుష్ మరియు ప్రాజెక్ట్ K వంటి సినిమాల్లో నటిస్తున్నాడు..ఈ సినిమాల తర్వాత ఆయన యూత్ ఫుల్ కామెడీ ఎంటెర్టైనెర్స్ తీసే మారుతి తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..ఈ మూవీ కి రాజా డీలక్స్ అనే పేరు ని కూడా పరిశీలిస్తున్నారు..ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది..రాధే శ్యామ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయం పాలవ్వడం తో ప్రభాస్ తానూ భవిష్యత్తు లో చెయ్యబొయ్యే సినిమాల పై ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు..ఈ నాలుగు సినిమాలు మాత్రమే కాకుండా మరో 9 యాక్షన్ సినిమాలు తన లైనప్ లో ఉన్నాయి అని ప్రభాస్ ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో తెలిపాడు.

    Also Read: Samantha Birthday: దేవకన్యలా సమంత రచ్చ.. లుక్ చూసి మెంటలెక్కిపోతున్న ఫ్యాన్స్ !

    Recommended Videos:

    Tags