Brahmastra 2- Prabhas: బాలీవుడ్ నుంచి వచ్చిన భారీ బడ్జెట్ మూవీ ‘బ్రహ్మస్త్ర’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారతీయ పురాణాల్లోని అస్త్రాలను ఆధారంగా చేసుకొని ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దీనిని తెరపైకి తెచ్చాడు. అయితే సినిమా రిలీజ్ సమయంలో అనేక వివాదాలు ఏర్పడినా వాటిని తట్టుకుని సెప్టెంబర్ 9న థియేటర్లోకి వచ్చింది. అద్భుతమైన కథాంశానికి తోడుగా గ్రాఫిక్స్ విజువల్స్ ఉండడంతో ఆడియన్స్ దీనిని ఆదరించారు. ఈ నేపథ్యంలో ‘బ్రహ్మస్త్ర’ సెకండ్ పార్ట్ కూడా వస్తుందని ముందే ప్రకటించారు. అయితే పార్ట్ 2 పై రకరకాల వార్తలు వస్తున్నాయి. లేటెస్టుగా ‘బ్రహ్మస్త్ర 2’లో ప్రభాస్ నటిస్తారనే వార్తలు వస్తున్నాయి. ‘బ్రహ్మస్త్ర’లోని దేవ్ పాత్ర కోసం డైరెక్టర్ ప్రభాస్ ను కలిసినట్లు సమాచారం.

‘బ్రహ్మస్త్ర’మొదటి భాగం ముగింపులో ఊహించిన ట్విస్ట్ ఉంటుంది. ఇందులో దేవ్ ను ప్రత్యర్థిగా పరిచయం చేస్తారు. అయితే దేవ్ పాత్ర ‘బ్రహ్మస్త్ర 2’ లో ప్రముఖంగా ఉండే అవకాశం ఉంది. ఈ పాత్ర కోసం ఆయాన్ బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీ వరకు స్టార్ హీరోలను కలిశాడట. వీరిలో హృతిక్ రోషన్, కన్నడ స్టార్ యశ్ ఉన్నారు. వీరితో పాటు తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను కూడా కలిశారు. దేవ్ పాత్రను ప్రభాస్ తో చేయించాలని అనుకున్నారట.
అయితే ప్రభాస్ ప్రస్తుతం ‘సాలార్’, ‘ప్రాజెక్ట్ కె’తో బిజీగా ఉన్నాడు. వీటితో పాటు మరో మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. ఇప్పటికిప్పుడు ఆ సినిమాలను పక్కనబెట్టి ‘బ్రహ్మస్త్ర’ కోసం రాలేదు. అలా అని ప్రభాస్ సినిమాలు కంప్లీట్ అయ్యే వరకు ‘బ్రహ్మస్త్ర’ టీం ఆగలేదు. దీంతో ప్రభాస్ డేట్స్ కష్టమేనని ఫ్యాన్స్ అంటున్నారు. అటు డైరెక్టర్ అయాన్ ప్రభాస్ కలిసినట్లు వార్తలు వస్తున్నా అఫీషియల్ గా ప్రకటించలేదు.

కానీ ఈ వార్తలపై కరణ్ స్పందించారు. ఈ వార్తలన్నీ ఫేక్ అన్నారు. దేవ్ పాత్ర కోసం ఆల్రెడీ హృతిక్ రోషన్ ను ఫైనల్ చేశామన్నారు. శివుడిగా రణబీర్ కపూర్ తో పాటు దేవ్ పాత్రలో హృతిక్ రోషన్ ఉంటారని డిక్లేర్ చేశాడు. దీంతో ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టినట్లయింది. అయితే ‘బ్రహ్మస్త్ర’ పార్ట్ 1 లో హీరో రణబీర్ తో పాటు అమితాబ్ బచ్చన్, తెలుగు నుంచి నాగార్జున నటించారు. మరి పార్ట్ 2లో టాలీవుడ్ నుంచి ఎవరుంటారనేది చర్చనీయాంశంగా మారింది.