https://oktelugu.com/

అల్లు అరవింద్, కరణ్ జోహార్ కాంబోలో ప్రభాస్

బాహుబలి చిత్రం తరవాత ప్రభాస్ నటించే సినిమాలన్నీ భారీ బడ్జట్ తో పాన్ ఇండియా మూవీస్ గా నిర్మాణమౌతున్నాయి `సాహో ` చిత్రం తరవాత ప్రభాస్ చేస్తున్నజిల్ ఫేమ్ . రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీ కావడం విశేషం . కాగా ఈ చిత్రానికి ‘ఓ డియర్’ .. ‘రాధేశ్యామ్’ అనే టైటిల్స్ లో ఒకదానికి ఫిక్స్ అవ్వాలను కొంటున్నారు […]

Written By:
  • admin
  • , Updated On : May 9, 2020 / 09:41 AM IST
    Follow us on


    బాహుబలి చిత్రం తరవాత ప్రభాస్ నటించే సినిమాలన్నీ భారీ బడ్జట్ తో పాన్ ఇండియా మూవీస్ గా నిర్మాణమౌతున్నాయి `సాహో ` చిత్రం తరవాత ప్రభాస్ చేస్తున్నజిల్ ఫేమ్ . రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీ కావడం విశేషం . కాగా ఈ చిత్రానికి ‘ఓ డియర్’ .. ‘రాధేశ్యామ్’ అనే టైటిల్స్ లో ఒకదానికి ఫిక్స్ అవ్వాలను కొంటున్నారు . ఇక ఈ చిత్రం తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ మరో పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఫాంటసీ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా సుమారు 500 కోట్ల బడ్జట్ తో రూపొందనుంది .. సూపర్ హీరోగా ప్రభాస్ కనిపించే ఈ సినిమా ఈ ఏడాది చివర్లో డిసెంబర్ నెలలో ప్రారంభం కానుంది .ఈ సినిమా పూర్తి కావడానికి సుమారు వన్ ఇయర్ పడుతుందట …

    ఆంధ్రా న్యూస్ ఛానెళ్ల పని ఖతమేనా?

    అదలావుంటే ఈ చిత్రం తరువాత ప్రభాస్ చేయనున్న సినిమా కూడా వందల కోట్ల భారీ బడ్జట్ రూపొందే చిత్రమే అని తెలుస్తోంది. తెలుగు , హిందీ భాషల్లో అగ్ర నిర్మాతలైన అల్లు అరవింద్ – కరణ్ జొహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తోంది .. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ హిందీ భాషల్లో రూపొందే ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీ కావడం విశేషం . కాగా ఈ చిత్రం 2022లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది .