Fauji Prabhas: ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతోంది. బాహుబలి సినిమాకి ముందు సినిమా తర్వాత అనే రేంజ్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా అద్భుతాలను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక ఈ సంవత్సరంలో కూడా భారీ సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చి అందరిని ఆకరించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని కూడా మెస్మరైజ్ చేస్తుందనే చెప్పాలి… ఇక ఇప్పటికే రామ్ చరణ్ లాంటి హీరో ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ప్రభాస్ , పవన్ కళ్యాణ్ వాళ్ల సినిమాలతో రావడానికి సిద్ధం అవుతున్నారు…
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ (Prabhas) లాంటి స్టార్ హీరోకి భారీ గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ‘సీతారామం’ (Setha Ramam) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ (Fouji) అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో ఇప్పటివరకు తను చేయనటువంటి ఒక ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ ని ఎంచుకొని చేస్తూ ఉండటం విశేషం… ఇక ఇందులోకు ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కూడా ఉంటుందట. మరి ప్రభాస్ అద్భుతమైన లవ్ స్టోరీ చేసి చాలా సంవత్సరాలు అవుతున్న నేపధ్యంలో ఈ సినిమా ఆయనకు చాలా వరకు మంచి గుర్తింపుని ఇవ్వడమే కాకుండా తనలోని నట విశ్వరూపాన్ని బయటికి తీస్తుంది అంటూ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు…ఇక ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రభాస్ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడట… (hanu Raghavapudi) ప్రతి సినిమా విషయంలోనూ ఫస్టాఫ్ బాగా తీస్తాడు.
కానీ సెకండ్ఆఫ్ సెకండ్ హాఫ్ అంతా బాగా తీయలేడనే ఒక బ్యాడ్ నేమ్ ను సంపాదించుకున్న హను రాఘవూడి సీతా రామం సినిమాతో చెక్ పెట్టాడు. మరి మరోసారి సెకండాఫ్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టి ఈ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఈ మూవీతో స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి చేరుకోవాలనే ఉద్దేశ్యంతో హను రాఘవపూడి ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకోసమే దీనిమీద తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ప్రభాస్ ఇచ్చిన డేట్స్ లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలి అనే ధోరణిలో ఆయన ముందుకు సాగుతున్నాడు. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే ప్రభాస్ స్పిరిట్ (Spirit) సినిమా మీద తన డేట్స్ ని కేటాయించబోతున్నారట. అయితే ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ ట్రాన్స్ లోనే ఉన్నాడట.
ఆ క్యారెక్టర్ తనకు చాలా బాగా సింక్ అయినట్టుగా తెలుస్తోంది. దాంతో షూటింగ్ లో బాగా ఎంజాయ్ చేస్తూ పాల్గొంటున్న ప్రభాస్ ఆ సినిమాని వీలైనంత తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యం లో ఉన్నారట. మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు ఒక ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నాడు అంటేనే ప్రతి ఒక్కరికి గుస్ బమ్స్ అయితే వస్తుంటాయి…