
హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ గుర్తుందా ? ‘లీడర్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘మిరపకాయ్’, ‘మిర్చి’ లాంటి హిట్ చిత్రాలతో వరుస అవకాశాలు వస్తోన్న టైంలోనే సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి ఫారెన్ వెళ్ళిపోయింది. అక్కడ స్టడీస్ కంటిన్యూ చేస్తూ ఓ విదేశీయుడితో ప్రేమలో పడి అతన్నే పెళ్లి చేసుకుంది.
అయితే, తాజాగా ఈ భామ తల్లి అయింది. మే 27న తనకు మగబిడ్డ పుట్టాడని సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కి తెలియజేసింది. ఈ క్రమంలో ఓ పోస్ట్ పెడుతూ తన బిడ్డకు ‘లుకా షాన్’ అనే పేరు పెట్టినట్లు కూడా చెప్పింది. ‘మా జీవితపు చిరు నవ్వు లుకా షాన్. మే 27న జన్మించాడు. మా బాబు రాకతో మా జీవితాల్లో కొత్త ఆశలు మొలిచాయి.
మేమంతా ఎంతో ఆనందంగా ఉన్నాం. లుకా ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, రూపురేఖల్లో అచ్చం తన తండ్రిలానే ఉన్నాడు. లుకా.. నువ్వు మా జీవితాల్లో వచ్చి మాకు మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని నింపావు’ అంటూ రిచా ఎమోషనల్ గా ఒక మెసేజ్ కూడా పెట్టింది. ‘మిర్చి’ హిట్ తరువాత రిచాకి మంచి ఆఫర్స్ వచ్చినా 2013లో ‘భాయ్’ సినిమా ఒక్కటే ఒప్పుకుంది.
ఇక ఆ తర్వాత ఉన్నత విద్య కోసం ఆమె అమెరికా వెళ్లి జోనుతో ప్రేమలో పడి, అతనితో వివాహబంధంలోకి అడుగుపెట్టి.. మొత్తానికి ఆమె నటనకు దూరం అయింది. ప్రస్తుతం ఆమె జీవితం ఎంతో సంతోషంగా ఉందట