Prabhas Cap: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్యన ‘సీతారామం’ ఫంక్షన్ కు హాజరయ్యాడు. నిన్న మరోసారి హైదరాబాద్‌లోని అవసా హోటల్‌లో సౌండ్ ఇంజనీర్ పప్పు (శ్రీనివాస్) కుమార్తె ఫంక్షన్‌కు ప్రభాస్ హాజరయ్యాడు. రెండు ఫంక్షన్లకు ఒకటే గెటప్ లో దర్శనమిచ్చాడు. అదే తలపై క్యాప్ పెట్టుకొని కనిపించాడు. ఇప్పుడు దీనిపైనే జోరుగా చర్చ సాగుతోంది.

ప్రభాస్ సలార్ సహా ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాల్లో నటిస్తున్నారు. ఈ మూడు వేటికవే సినిమాలు. ఇందులో ప్రభాస్ ఒక్కో దాంట్లో ఒక్కోలా కనిపిస్తాడు. కానీ బయట మాత్రం ప్రభాస్ ఒకే తీరుగా కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
సలార్ లో ఊరమాస్ లుక్, ఆదిపురుష్ లో శ్రీరాముడి లుక్ లోకి.. ఇక ప్రాజెక్ట్ కేలో సైన్స్ ఫిక్షన్ గెటప్ ఉండాలి. కానీ ప్రభాస్ మాత్రం స్మార్ట్ లుక్ లోనే కనిపిస్తున్నాడు. ఇక ప్రభాస్ వరుసగా రెండు సార్లు బయటకు వస్తే రెండు సార్లు కూడా టోపీ పెట్టుకొని కనిపించడం ఏంటి చెప్మా అని అందరూ ఆరాతీస్తున్నారు.

ఎందుకంటే సీతారామం ఫంక్షన్ కు తాను రానంటే బలవంతంగా తీసుకొచ్చారని ప్రభాస్ ఆ ఫంక్షన్ లోనే చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మరో ఫంక్షన్ లో కూడా అదే క్యాప్ తో దర్శనమిచ్చాడు. దీన్ని బట్టి చూస్తుంటే నిజంగానే ప్రభాస్ ఏమైనా జుట్టు ఊడిపోయిందా.? బట్టతల వచ్చిందా? అందుకే బయటకు రావడం లేదా? కవర్ చేసుకోవడానికి క్యాప్ పెట్టుకున్నాడా? అన్న అనుమానాలు కలుగకమానవు.
ప్రభాస్ క్యాప్ లేకుండా కనిపించినప్పుడు మాత్రమే ఈ అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. లేదంటే ఈ క్యాప్ ధరించిన ఫొటోలకు సమాధానం దొరకదు.
[…] […]