https://oktelugu.com/

Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ కి ప్రభాస్ డిజాస్టర్ ఇచ్చాడు… మరి ఎన్టీయార్ సక్సెస్ ఇస్తాడా..?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న నటులు తెలుగు హీరోల సినిమాల్లో విలన్లుగా నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నారు... అందుకే ప్రతి ఒక్కరూ తెలుగు సినిమాల్లో అవకాశం వచ్చిందంటే చాలు వదులుకోకుండా సినిమాలను చేస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 18, 2024 / 10:10 AM IST

    Saif Ali Khan

    Follow us on

    Saif Ali Khan: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగుతుందనే విషయం మనలో చాలామందికి తెలియదు. ముఖ్యంగా సినిమా అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం ఉంటుంది. కొంతమందికి సినిమాలు చూడడం ఇష్టం ఉంటే మరి కొంతమందికి సినిమాలు తీయడం ఇష్టం ఉంటుంది. ఇక ఆ ధోరణి లోనే చాలామంది యంగ్ డైరెక్టర్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే వాళ్ళు వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి క్రమంలో వారు చేస్తున్న సినిమాల విషయంలో ఎలాంటి సక్సెస్ లు రాబోతున్నాయి అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక మొత్తానికైతే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ వరుస సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ బాలీవుడ్ లో ఓం రావత్ డైరెక్షన్ లో చేసిన ఆది పురుష్ సినిమా గత సంవత్సరం రిలీజ్ అయి భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది. అయితే ఈ సినిమాలో రావణాసురుడి గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆ సినిమాలో ఏ మాత్రం ఇంపాక్ట్ ని చూపించలేకపోయాడు.

    ఇక ఈ సినిమా మేకింగ్ విషయంలోనే చాలా వరకు తప్పులు జరగడంతో ఈ సినిమా ఆశించడం మేరకు విజయాన్ని అయితే సాధించలేదు. దాంతో ప్రభాస్ సైఫ్ అలీ ఖాన్ కి కి సక్సెస్ ని అందించలేకపోయాడు. ఇక విలన్ గా అదరగొడతాడు అనుకున్నా సైఫ్ అలీ ఖాన్ ఏమాత్రం ప్రభావం చూపించకపోవడంతో అతని యాక్టింగ్ మీద కూడా ప్రేక్షకులకు విసుగు పుట్టింది. మరి ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఆయన దేవర సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.

    నిజానికి ఈ సినిమాలో ఆయన తన నట విశ్వరూపం చూపించబోతున్నాడు అంటూ కొరటాల శివ ఇంతకుముందే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మరి ఆయన ఎలాంటి నటనతో ప్రేక్షకులకు దగ్గరవ్వబోతున్నాడు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రభాస్ ఇవ్వలేని సక్సెస్ ని ఎన్టీఆర్ ఇస్తాడా అనే ధోరణి లో కూడా వార్తలైతే వస్తున్నాయి.

    మరి మొత్తానికైతే సైఫ్ అలీ ఖాన్ తనను తాను విలన్ గా ప్రూవ్ చేసుకోవాలని తద్వారా భారీ అవకాశాలను అందుకొని పాన్ ఇండియాలో స్టార్ విలన్ గా వెలుగొందాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాతో ఎన్టీయార్ సైఫ్ అలీ ఖాన్ కి భారీ సక్సెస్ ని అందిస్తాడా తద్వారా తను విలన్ గా మరికొన్ని సినిమాలకు అవకాశాలను అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…