Fauji First Look: ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో ఒకటి ‘ఫౌజీ’. ‘సీత రామం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రభాస్ తో హను రాఘవపూడి చేస్తున్న చిత్రమిది. అయితే ప్రభాస్ లాంటి యాక్షన్ హీరో కి లవ్ స్టోరీస్ ఇప్పుడు వర్కౌట్ అవ్వదు అనేది ‘రాధే శ్యామ్’ తో ఒకసారి నిరూపితమైంది. మళ్లీ అలాంటి జానర్ సినిమాలే ఎందుకు చేస్తున్నారు , కచ్చితంగా ఈ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. అభిమానులు కూడా ప్రభాస్ నుండి భవిష్యత్తులో రాబోయే ‘స్పిరిట్’, ‘కల్కి 2 ‘ వంటి చిత్రాలపై భారీ అంచనాలు పెట్టుకున్నారు కానీ , ఈ సినిమా పై ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదు. దానికి తోడు మూవీ టీం కూడా చాలా సైలెన్స్ ని మైంటైన్ చేయడం తో , ప్రభాస్ కెరీర్ లో ఇది మరో ‘రాధే శ్యామ్’ అవుతుందని ఫిక్స్ అయిపోయారు. అలాంటి సమయం లో నేడు మేకర్స్ ఈ చిత్రం నుండి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చూసి ఫ్యాన్స్ మెంటలెక్కిపోయారు.
యుద్ధ రంగంలో శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడి , విశ్రాంతి తీసుకుంటున్న సింహం లాగా ప్రభాస్ ని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూపించారు. ఎదో సాధారణ లవ్ స్టోరీ ని తెరకెక్కిస్తారని అనుకుంటే , ఈ రేంజ్ మాస్ చూపించరేంటి , సినిమాలో ఇలాంటివి చాలానే ఉన్నట్టు ఉన్నాయి అని అభిమానులు మురిసిపోతున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని డిసెంబర్ 3 న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషల్లోనూ గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు మేకర్స్. అందుకు సంబంధించిన ట్వీట్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఒక భారతీయ సైనికుడికి , పాకిస్తానీ అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమకథ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారట డైరెక్టర్ హను రాఘవపూడి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన భాగం షూటింగ్ మొత్తం పూర్తి అయ్యిందట. ప్రభాస్ కూడా తన భాగానికి సంబంధించిన షూటింగ్ ని దాదాపుగా పూర్తి చేసినట్టు సమాచారం.
త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని కూడా విడుదల చేయబోతున్నారట. ఇకపోతే ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకు ఇదే మొట్టమొదటి చిత్రమట. ఇన్ స్టాగ్రామ్ లో పాపులర్ అయినటువంటి ఈమెకు , ఏకంగా మొదటి సినిమాలో ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తో కలిసి నటించడం అనేది మామూలు అదృష్టం కాదు. రాబోయే రోజుల్లో ఈ సినిమా నుండి వచ్చే ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుందని , కచ్చితంగా ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లో ఒక ల్యాండ్ మార్క్ లాగ నిలుస్తుందని రానున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ పై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి.
अज्ञातपर्व ENDS.
THE REBELLION BEGINS #Fauzi GRAND RELEASE WORLDWIDE ON 3rd DECEMBER 2026 ❤️#FauziOnDec3Rebel Star #Prabhas#Imanvi @hanurpudi #MithunChakraborty #JayaPrada @AnupamPKher @Composer_Vishal @sudeepdop @kk_lyricist @MrSheetalsharma @rckamalakannan… pic.twitter.com/IUQaZLPb2Y
— Fauzi (@FauziTheMovie) July 16, 2026
