Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే నేడు. 1979 అక్టోబర్ 23న ప్రభాస్ జన్మించాడు. ఆయన 44వ ఏట అడుగు పెట్టాడు. ఇక వరల్డ్ వైడ్ ప్రభాస్ అభిమానులు వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రభాస్ కట్ అవుట్ నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ కట్ అవుట్ తో నయా రికార్డు నమోదు చేశారు. కూకట్ పల్లిలోని కతైలాపూర్ గ్రౌండ్స్ వేదిక బర్త్ డే వేడుకలు ఏర్పాటు చేశారు. అక్కడే 230 అడుగుల భారీ కట్ అవుట్ ఏర్పాటు చేశారు.
ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన ఫోటోతో కూడిన టీషర్ట్స్ ధరించి ర్యాలీ చేశారు. ప్రభాస్ అభిమానుల కోలాహలం మాములుగా లేదు. అనంతరం కతైలాపూర్ గ్రౌండ్స్ లో ఉన్న కట్ అవుట్ దగ్గరకు చేరుకున్నారు. కట్ అవుట్ ని ఫోటోలు, వీడియోలు తీస్తూ, సెల్ఫీలు దిగుతూ హంగామా చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కర్ణాటకలో 216 అడుగుల యష్ కట్ అవుట్ ఏర్పాటు చేయగా అదో రికార్డు అనుకున్నారు. యష్ రికార్డుని ప్రభాస్ బ్రేక్ చేశాడు.
సలార్ చిత్రంలో ప్రభాస్ రెండు కత్తులు పట్టుకొని ఊచకోత కోసే ఐకానిక్ పోజ్ ని కట్ అవుట్ గా ఏర్పాటు చేశారు. ఇక సలార్ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాని కారణంగా వాయిదా వేశారు. అన్ని ఏరియాల్లో రికార్డు బిజినెస్ చేసింది సలార్. ఒక్క నైజాం ఏరియా హక్కులు రూ. 65 కోట్లు పలికాయని సమాచారం. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఇదే హైయెస్ట్.
సలార్ చిత్రానికి కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో అంచనాలు ఆకాశానికి చేరాయి. ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. జగపతి బాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు. కెజిఎఫ్ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సలార్ కూడా రెండు భాగాలుగా విడుదల కానుందని సమాచారం.