Prabhas Fans On Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ ఓ వ్యక్తిని చితకబాదారు. ఆదిపురుష్ ప్రదర్శిస్తున్న థియేటర్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఆదిపురుష్ మూవీ నేడు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల చేశారు. తెల్లవారుజామునుంచే ఆదిపురుష్ చిత్ర ప్రదర్శనలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ అభిమానులు థియేటర్స్ కి పోటెత్తారు. ఆదిపురుష్ థియేటర్స్ వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. పెద్ద పెద్ద కట్ ఔట్స్ ఏర్పాటు చేశారు. పూజలు నిర్వహిస్తున్నారు.
కాగా ఆదిపురుష్ మూవీ చూసిన కొందరు ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అంచనాలు అందుకోలేదు, మూవీ నచ్చలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ప్రభాస్ ఫ్యాన్స్ దాడికి గురయ్యాడు. థియేటర్ నుండి బయటకు వచ్చిన వ్యక్తిని మూవీ ఎలా ఉందని అడగ్గా? నచ్చలేదు, పెద్ద రాండ్ అంటూ సమాధానం చెప్పాడు. అక్కడే ఉన్న ప్రభాస్ అభిమానులు కోపంతో ఆ వ్యక్తి మీద దాడి చేశారు. చితకబాదారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.
సినిమా నచ్చలేదన్న వ్యక్తిని అలా చితకబాదడం సరికాదని పలువురు అభిప్రాయం వెల్లడిస్తున్నారు. ఆదిపురుష్ మూవీ మిశ్రమ స్పందన దక్కించుకుంది. కొంతమేర ఆదిపురుష్ మూవీ మెప్పించిందంటున్న ఆడియన్స్ కొన్ని అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, లంకేశ్వరుడు లుక్, సెకండ్ హాఫ్ నిరాశపరిచాయని అంటున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం మూవీ అద్భుతం అంటున్నారు. ఆదిపురుష్ మూవీపై భారీ హైప్ నడిచింది. దీంతో పెద్ద ఎత్తున ఓపెనింగ్స్ దక్కాయి. అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఇక ఆదిపురుష్ భవితవ్యం రేపు తేలనుంది. వీకెండ్ ఘనంగా ముగిస్తే ఆదిపురుష్ మేకర్స్ చాలా వరకు బయటపడ్డట్లే. ఇక ఆదిపురుష్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఐదు భాషలకు గాను మొత్తం రూ. 150 కోట్లు డిజిటల్ రైట్స్ దక్కాయని సమాచారం.
Review Lu Twitter Lo Kaadhu
Baytaki Ochi Cheppandi Ila Chudham#BlockbusterAdipurush #Prabhas #Adipurush pic.twitter.com/ychGjo5DKp— yaswanth_PRABHAS*™* (@yashprabhas123) June 16, 2023