Prabhas Europe Trip: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వెకేషన్ కోసం యూరప్ ట్రిప్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ప్రభాస్ యూరప్ ట్రిప్ ముగిసింది. ఇక పూర్తి చేయాల్సిన తన సినిమాల పై ఫుల్ ఫోకస్ పెట్టడానికి ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్, ఆదిపురుష్ మూవీలను కంప్లీట్ చేశాడు. త్వరలోనే సలార్ షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

మిగిలిన భాగాన్ని వీలైనంత తొందరగా పూర్తి చేయాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి సలార్ షూటింగ్ మళ్లీ పట్టాలెక్కబోతుంది. ఇక ఈ సినిమాలో మిస్ ఇండియా మీనాక్షి చౌదరి ప్రేయసిగా నటించబోతుంది. అన్నట్టు ఆమె పాత్ర విషయానికి వస్తే. ఓ ఉన్నతాధికారి పాత్రలో కనిపించబోతుందట. తన అవసరం రీత్యా ఆమెతో ఎఫైర్ పెట్టుకుని తను అనుకున్నది ప్రభాస్ సాధిస్తాడట.
Also Read: ‘మహేష్’ మరదలిగా ‘రానా’ హీరయిన్ ఖరారు

కాకపోతే సలార్ సినిమాలో ఈ ట్రాక్ నాలుగు సీన్స్ లో ముగుస్తోందని తెలుస్తోంది. కాగా హై వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రానున్న ‘సలార్’ సినిమా నేషనల్ రేంజ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా కొత్త షెడ్యూల్ లో మీనాక్షి చౌదరి పార్ట్ తీయబోతున్నారు. అంటే.. ప్రభాస్ ఇప్పుడు మీనాక్షి చౌదరితో రొమాన్స్ కి రెడీ అవుతున్నాడు.
మొత్తానికి మీనాక్షి చౌదరి కెరీర్ ఈ సినిమాతో టర్న్ అయినట్టే. కాగా ‘సలార్’లో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్ పై భారీ అంచనాలున్నాయి.
Also Read: కరువు రాయలసీమకు సముద్రం తీసుకొచ్చిన జగన్
[…] […]