Homeజాతీయ వార్తలుPM Narendra Modi: ఏ రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఉంటే.. ఆ వేష‌ధార‌ణ‌.. ఇదే ప్రధాని మోడీ...

PM Narendra Modi: ఏ రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఉంటే.. ఆ వేష‌ధార‌ణ‌.. ఇదే ప్రధాని మోడీ నైజం..!

PM Narendra Modi: మన దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ దేశమంతా ప్రభావం చూపడంలో అందరినీ ఒకేసారి భావుకతకు లోనయ్యేలా చేయడంలో ఎక్స్ పర్ట్ అని రాజకీయ పరిశీలకులు అంటుంటారు. అది ఎలక్షన్ స్ట్రాటజీ అంటూ విపక్షాలు విమర్శలు చేస్తుంటాయి. కానీ, నరేంద్ర మోడీ మాత్రం తనదైన స్టైల్‌లో దూసుకుపోతూనే ఉంటారు. తాజాగా రిపబ్లిక్ డే వేడుకల్లోనూ జిమ్మిక్ చేశారు మోడీ.

PM Narendra Modi
PM Narendra Modi

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వెరీ డిఫరెంట్ గెటప్ వేసుకుని మోడీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. భగత్ సింగ్ తరహా టోపీ.. ఓ విభిన్నమైన కండువాతో వేడుకల్లో పాల్గొన్నారు. టోపీపై బ్రహ్మకమలం ముద్ర ఉండటం విశేషం. ఇక మోడీ గెటప్ చూసి నెటిజన్లు సోషల్ మీడియాలో బోలెడంత చర్చ చేస్తున్నారు. ఉత్తరాఖండ్ సంప్రదాయ టోపీని మోడీ ధరించారని, మెడలో మణిపూర్ సంప్రదాయ కండువా వేసుకున్నారని, తద్వారా ఆ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలను ప్రభావితం చేయగలరని కామెంట్స్ చేస్తున్నారు.

PM Narendra Modi
PM Narendra Modi

Also Read: ఏపీ నడిబొడ్డున త్రివర్ణ జెండా ఎగరనీయని జగన్.. జాతీయ స్థాయిలో రచ్చ
గతంలోనూ మోడీ ఇటువంటి జిమ్మిక్కులు చేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ తరహా గెటప్ లో మోడీ వచ్చారని అంటున్నారు. గతేడాది మార్చిలో వ్యాక్సిన్ తీసుకున్నపుడు మోడీ అసోం సంప్రదాయ కండువా వేసుకుని వచ్చానని చెప్పారు. ఈ సందర్భంలోనే తాను కేరళ, పుదుచ్చేరి నర్సులతో టీకా వేయించుకున్నానని పేర్కొని.. హైలైట్ అయ్యారు. అలా ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో కొంత మేరకు అయినా ఆయన ప్రభావం చూపారని పలువురు అంటున్నారు.

అలా ఏ రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఉంటే ఆయా రాష్ట్రాల సంప్రదాయ వస్త్రాల్లో వేడుకలకు హాజరు కావడం మోడీ స్టైల్ అని ఈ సందర్భంగా కొందరు అంటున్నారు. ఏదేని కార్యక్రమంలోనూ మోడీ అలానే ఉంటారని చెప్తున్నారు. దేశప్రధానిగా నరేంద్రమోడీ తనకంటూ స్పెషల్ ఉండేందుకుగాను ఎప్పుడూ ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తుంటారని, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచేందుకుగాను ప్రయత్నిస్తుంటారని కొందరు వివరిస్తున్నారు. ఇకపోతే దేశ ప్రధానిని చూసి దేశ ప్రజలందరూ కూడా ఎంతో కొంత ఇన్ స్పైర్ అవడమే కాదు.. ప్రభావితమయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Also Read: భారత రాజ్యాంగం ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

1 COMMENT

  1. […] Shyam Singaray: రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి లు హీరోయిన్లుగా వచ్చిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా మరో అరుదైన రికార్డును నెలకొల్పింది. థియేటర్లలో మంచి హిట్ సాధించిన ఈ మూవీ నెట్‌ ఫ్లిక్స్‌ లోనూ రిలీజై బాగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ సినిమాకు ఇప్పటి వరకూ 35,90,000 వీక్షణలు వచ్చాయి. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular