Prabhas : ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు భారీ విజయాలను అందుకుంటూ వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రస్తుతం మన హీరోలందరూ పాన్ ఇండియా బాట పడుతున్న విషయం మనకు తెలిసిందే. అందులో చాలామంది సూపర్ సక్సెస్ లను అందుకుంటే మరి కొంతమంది మాత్రం భారీ సక్సెస్ లను అందుకోవడంలో ఫెయిల్ అయిపోతున్నారు. బాహుబలి(Bahubali) సినిమాతో ప్రభాస్ తన ప్రభంజనాన్ని సృష్టించాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రభాస్ (Prabhas) లాంటి హీరో సైతం తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక ఇప్పటికే పాన్ ఇండియాలో తనదైన రీతిలో సక్సెస్ లను సాధిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కానీ రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ప్రభాస్ ప్రస్తుతం తాను చేసిన సినిమాలు అన్నింటికి సీక్వెల్ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే కల్కి(Kalki), సలార్ (Salaar) లాంటి సినిమాలకు సీక్వెల్స్ ని చ్చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ‘రాజాసాబ్’ (Rajasaab) సినిమాకి కూడా సీక్వెల్ ని చేసే పనిలో ఉన్నారట. ఇక మారుతి(Maruthi) ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడు. ప్రభాస్ ఇలా ప్రతి సినిమాకి సీక్వెల్ ను తీసుకుంటూ వెళ్తే అతనితో సినిమా చేయాలనుకునే కొత్త దర్శకులకి ఎప్పుడు అవకాశం వస్తుంది. ఇక ఈ సీక్వెల్ సినిమాలను చేసుకుంటూ వెళ్తే ఆయన కొన్ని క్యారెక్టర్లకు మాత్రమే పరిమితం అయిపోతాడు.
అలాకాకుండా కొత్త దర్శకులతో ఫ్రెష్ స్టోరీ లతో సినిమాలు చేసినట్టయితే ఆయనలో ఉన్న వివిధ కోణాలనేవి బయటకు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి సీక్వెల్ సినిమాలను చేసే కంటే కొత్త స్టోరీలను ఎంచుకొని కొత్త దర్శకులకు అవకాశం ఇస్తే చాలా మంచిదని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మరి ఇప్పటికైనా ప్రభాస్ సిక్వెల్ సినిమాలను చేయడం మానేసి కొత్త కథలతో సినిమాను చేస్తే బాగుంటుంది. తద్వారా ఆయనకు డిఫరెంట్ క్యారెక్టర్ లను పోషించే అవకాశామైతే దొరుకుతుంది. అలా కాకుండా సీక్వెల్ సినిమాలను చేయడం వల్ల ఒకే క్యారెక్టర్ కు స్టిక్ అయిపోయి ఆ క్యారెక్టర్ లో నటించాల్సి ఉంటుంది.
సీక్వెల్ సినిమాలకి ఫ్రాంచైజింగ్ అవ్వడం వల్ల ఆయా సినిమాలకు బజ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయి కానీ ప్రభాస్ క్యారెక్టర్ లో వేరియేషన్స్ చూపించడానికి మాత్రం అవకాశమైతే ఉండదు. అందుకే కొత్త కథలతో సినిమాలను చేస్తే మంచిదని విమర్శకులు సైతం ప్రభాస్ ని విమర్శిస్తున్నారు…చూడాలి మరి ఇక మీదట ఆయన ఎలాంటి కథలతో ప్రేక్షకులను మెప్పిస్తాడు అనేది…