Homeఎంటర్టైన్మెంట్Prabhas Darling Re Release: 'డార్లింగ్ ' రీ రిలీజ్ కి సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్.....

Prabhas Darling Re Release: ‘డార్లింగ్ ‘ రీ రిలీజ్ కి సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్.. ఎంత గ్రాస్ వచ్చిందో చూస్తే ఆశ్చర్యపోతారు..

Prabhas Darling Re Release: ప్రభాస్(Rebel Star Prabhas) కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉండొచ్చు, కానీ అభిమానులు , ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే సినిమాల్లో ఒకటి డార్లింగ్. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ, మాస్ లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ప్రభాస్ నుండి , ఇలాంటి సాఫ్ట్ లవ్ స్టోరీ ని అప్పటి అభిమానులు తీసుకోలేకపోయారు. అందుకే కేవలం హిట్ గా మాత్రమే మిగిలింది , లేదంటే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. అయితే ఈ చిత్రం టీవీ టెలికాస్ట్ ద్వారా , నేటి తరం యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. అందుకే ఈ సినిమాని ఈ నెల 23 న గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని హైదరాబాద్ , వైజాగ్ వంటి ప్రాంతాల్లో ప్రారంభించారు.

లిమిటెడ్ షోస్ తో ప్రారంభించినప్పటికీ బుక్ మై షో యాప్ లో గంటకు 5 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పటి వరకు బాహుబలి, గబ్బర్ సింగ్, ఖలేజా వంటి రీ రిలీజ్ చిత్రాలకు మాత్రమే ఈ రేంజ్ ట్రెండ్ కనిపించింది. ఇప్పుడు ఆ జాబితాలోకి ‘డార్లింగ్’ కూడా చేరిపోయింది. సినిమా విడుదలకు ఇంకా 6 రోజుల సమయం ఉంది, అయినప్పటికీ కేవలం హైదరాబాద్ సిటీ నుండే ఈ చిత్రానికి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ సమ్మర్ కి చెప్పుకోదగ్గ సినిమాలు కూడా ఏమి లేకపోవడం తో , హైదరాబాద్ లోని టాప్ మోస్ట్ థియేటర్స్ అన్నీ ఈ చిత్రానికే కేటాయించారు. దీంతో కచ్చితంగా ఈ చిత్రం హైదరాబాద్ సిటీ నుండే 3 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. హైదరాబాద్ వరకు బాగానే ఉంది కానీ , ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగడం లేదు.

ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే , ఇప్పటి వరకు నార్త్ అమెరికా నుండి ఈ చిత్రానికి 7900 డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది అద్భుతమైన బుకింగ్స్ అని చెప్పొచ్చు కానీ , గబ్బర్ సింగ్ క్రియేట్ చేసిన రికార్డు కి దరిదాపుల్లోకి కూడా వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఆ చిత్రాన్ని వర్కింగ్ డే లో విడుదల చేసినప్పటికీ కూడా 60 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. డార్లింగ్ చిత్రానికి ప్రస్తుతానికి ఉన్న ఊపుని బట్టి చూస్తుంటే 20 నుండి 30 వేల డాలర్ల లోపే వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రానికి మొదటి రోజు 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version