Homeఎంటర్టైన్మెంట్Prabhas Darling child actor: 'డార్లింగ్' లో ప్రభాస్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన ఈ బుడ్డోడు...

Prabhas Darling child actor: ‘డార్లింగ్’ లో ప్రభాస్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన ఈ బుడ్డోడు ఇప్పుడు ఎంత పెద్ద హీరో అయ్యాడో తెలుసా..

Prabhas Darling child actor: ప్రభాస్(Rebel Star Prabhas) కెరీర్ లో ఎన్నో సంచలనాత్మక బ్లాక్ బస్టర్ హిట్స్ ఉండొచ్చు , ఇండస్ట్రీ హిట్స్ ఉండొచ్చు , భవిష్యత్తులో కూడా ఆయన ఎవ్వరూ చూడని రేంజ్ ని చూడొచ్చు, కానీ ‘డార్లింగ్'(#Darling4K) లాంటి సినిమాలను ఆయన మళ్లీ చేయడం చాలా కష్టమే , అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రభాస్ కి ప్రస్తుతం ఉన్న మాస్ ఇమేజ్ కి ఒకవేళ చేసినా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వదు. ఆరోజుల్లోనే ఈ చిత్రం యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఎందుకంటే ప్రభాస్ కి ఊర నాటు మాస్ ఇమేజ్ ఉండడం వల్లే. దానికి తోడు ఈ చిత్రానికి పోటీ గా బాలయ్య ‘సింహా’ చిత్రం వచ్చింది. అప్పట్లో ఇదొక సెన్సేషన్. ఆ సినిమా మేనియా లో ‘డార్లింగ్’ ని అప్పట్లో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ రీసెంట్ గా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయగా, నేటి తరం జెన్ జీ ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.

మొదటి రోజే 5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , రెండవ రోజు కూడా అద్భుత్మైన గ్రాస్ వసూళ్లను నమోదు చేసుకొని, రీ రిలీజ్ చిత్రాల్లో ఆల్ టైం రికార్డు గ్రాస్ ని నమోదు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా ఈ చిత్రం లో నటించిన నటీనటులు కొంతమంది హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్స్ లో వీక్షించారు. వారిలో ప్రభాస్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన గౌరవ్ దాసరి కూడా ఉన్నాడు. ఈయన నిన్న ప్రభాస్ అభిమానుల మధ్య కూర్చొని కేరింతలు కొడుతూ సినిమాని చూడడం హైలట్ గా నిల్చిన అంశం. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

గౌరవ్ ఇప్పుడు చూసేందుకు డైనమిక్ హీరో లాగా అనిపిస్తున్నాడు. ఈయన ఈమధ్య కాలం లో కొన్ని సినిమాల్లో హీరో గా నటించాడు , కానీ అవి ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కించుకోలేదు. అయినప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు . మరి ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయో లేదో చూడాలి. ఇకపోతే సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఇకపోతే నేడు కూడా ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. బుక్ మై షో యాప్ లో గంటకు వెయ్యికి పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఒక రీ రిలీజ్ సినిమాలు మూడవ రోజు బుక్ మై షో యాప్ లో ఇలాంటి ట్రెండ్ ఉండడం మామూలు విషయం కాదు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular