Prabhas Confirmed Multi-starrer : శాన్ డియాగో కామిక్ కాన్ వేదికగా ప్రభాస్ కీలక ప్రకటన చేశారు. ఆర్ ఆర్ ఆర్ హీరోలతో సినిమా చేస్తా అంటూ మైండ్ బ్లాక్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్లో సందడి చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ కల్కి కామిక్ కాన్ నుండి ఆహ్వానం పొందింది. ఈ అంతర్జాతీయ సినిమా ఈవెంట్లో కల్కి తరపున ప్రభాస్, రానా, కమల్ హాసన్, నాగ్ అశ్విన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కామిక్ కాన్ వేదికగా కల్కి టైటిల్ అండ్ టీజర్ విడుదల చేశారు. సూపర్ హీరోగా ప్రభాస్ అంచనాలు పెంచేశారు.