Prabhas Cameo Impact: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. దానికోసం అహర్నిశలు ప్రయత్నించాల్సిన అవసరమైతే ఉంది. ఒక మంచి కథను రాసుకున్న దర్శకుడు దానికి అనుగుణమైన హీరోని ఎంచుకొని దాన్ని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే సినిమా సక్సెస్ అవుతోంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas)…ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చినవే కావడం విశేషం…ఇక ప్రస్తుతం ఆయన ఫౌజీ (Fouji) సినిమాతో బిజీగా ఉన్నప్పటికి మోహన్ బాబు (Mohan Babu) మీద ఉన్న అభిమానంతో మంచు విష్ణు(Vishnu) చేసిన కన్నప్ప (Kannappa) సినిమాలో రుద్ర (Rudra) అనే క్యారెక్టర్ లో నటించాడు. అతను ఉన్నది ఐదు నిమిషాలే అయినప్పటికి ఆయన ఉన్న ఆ సీక్వెన్స్ మొత్తం సినిమా కి హైలైట్ గా నిలిచింది. ఒకరకంగా చెప్పాలంటే కన్నప్ప సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంలో ప్రభాస్ చాలా కీలకపాత్ర వహించాడనే చెప్పాలి. దానివల్ల సినిమాకి ఓపెనింగ్స్ కూడా భారీ లెవెల్లో వచ్చాయనే చెప్పాలి…ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసిన విష్ణు తను మాట్లాడుతూ సినిమాలో ప్రభాస్ వచ్చిన తర్వాత హై వచ్చిందని అందరూ అంటున్నారు. కానీ ప్రభాస్ రావడానికి ముందే నాకు శరత్ కుమార్ కి మధ్య జరిగిన కన్వర్జేషన్ నుంచే సినిమాకి హై వచ్చింది.
Also Read: సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా కోసం ఆ స్టార్ హీరోను తీసుకుంటున్నాడా .?
ప్రేక్షకులు కూడా అక్కడ బాగా కనెక్ట్ అయ్యారు అంటూ ఆయన మాట్లాడాడు. ఒక రకంగా ఆయన మాట్లాడిన మాటలను బట్టి చూస్తే ప్రభాస్ కంటే ముందే సినిమాకి హై వచ్చిందని ప్రభాస్ వల్ల మాత్రమే రాలేదని తను కూడా ఈ సినిమాకి చాలా వరకు న్యాయం చేశానని చెప్పుకోవడమే మంచు విష్ణు యొక్క అభిప్రాయం అంటూ ప్రభాస్ అభిమానులు ఆయన మీద తీవ్రంగా మండిపడుతున్నారు.
నిజానికి ప్రభాస్ వల్లే ఈ సినిమాకి హైపోచ్చింది. మొదటిరోజు సినిమా చూడడానికి ప్రేక్షకులు థియేటర్ కి వచ్చారు. ఆయన గొప్పతనాన్ని ఒప్పుకుంటే మంచు విష్ణుకు పోయేదేముంది అంటూ ప్రభాస్ అభిమానులు సైతం కొంతవరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మంచి ఫ్యామిలీ వాళ్ళతో సినిమా చేయడమే ఒక పెంటలాంటిది అని ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకున్నప్పుడే చాలామంది తన సన్నిహితులు చెప్పారట.
Also Read: కన్నప్పలో ఎన్టీఆర్ ఎలా మిస్సయ్యాడు?
అయినప్పటికి మోహన్ బాబు మీద ఉన్న అభిమానంతో ఆయన సినిమా చేశాడు. దానికి కృతజ్ఞతగా వాళ్ళు అతన్ని పొగడటం మానేసి ఇలా ప్రభాస్ వల్ల ఏమీ కాలేదు మా వల్లే అంతా అయింది అని చెప్పుకోవడం నిజంగా దురదృష్టకరం అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
“I have no ego in accepting that #Prabhas brought the massive openings for #Kannappa.” pic.twitter.com/s47oq3RzQz
— Gulte (@GulteOfficial) June 28, 2025