Prabhas- Om Raut: సోషల్ మీడియాలో ప్రభాస్ సీరియస్ గా ఉన్న వీడియో వైరల్ గా మారింది. ఆయన ఆ వీడియోలో ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ ని తన గదిలోకి రమ్మని కొంచెం సీరియస్ గా పిలుస్తున్నారు. ప్రభాస్ కళ్ళల్లో కోపం క్లియర్ గా కనిపిస్తుంది. ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ తరం స్టార్స్ లో రాముడిగా నటించే అవకాశం మా డార్లింగ్ కి వచ్చిందని సంబరపడిపోయారు. ఇక వెండితెరపై ప్రభాస్ వీర విహారమే అని పొంగిపోయారు. కానీ వాళ్ళ ఆశలను, కలలను ఆదిపురుష్ టీజర్ నీరుగార్చింది.

ఏమాత్రం ప్రమాణాలు లేకుండా ఉన్న ఆదిపురుష్ టీజర్ కార్టూన్ మూవీని గుర్తు చేసింది. సదా సీసా నాసిరకం గ్రాఫిక్స్, ఆకట్టుకొని క్రియేటివ్ ఆర్ట్ తీవ్ర నిరాశపరిచాయి. ఇక ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్, బాలీవుడ్ జనాలు ఆదిపురుష్ టీజర్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. టీవీ సీరియల్ కంటే దారుణంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. బహుశా ప్రభాస్ కూడా ఆదిపురుష్ అవుట్ ఫుట్ చూశాక షాక్ తిని ఉండవచ్చు.
ఈ క్రమంలో రెండేళ్ల పాటు దర్శకుడు పొడిచింది ఇదేనా అని ఫ్యాన్స్ అంటున్నారు. ఒక పాన్ ఇండియా స్టార్ తో సినిమా అంటే కనీస జాగ్రత్తలు తీసుకోరా అని మండిపడుతున్నారు. అందులోనూ ఆదిపురుష్ గ్రాఫిక్ వర్క్ కే అధిక సమయం కేటాయించారు. షూటింగ్ త్వరగా పూర్తి చేసిన ఓం రౌత్ నెలల తరబడి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై పని చేస్తున్నారు. సర్వత్రా ఆదిపురుష్ మూవీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ సహనం కోల్పోయాడనిపిస్తుంది.

దర్శకుడు ఓం రౌత్ ని ప్రభాస్ సీరియస్ గా గదిలోకి పిలుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ప్రభాస్… రౌత్ నువ్వు నా రూమ్ కి రా’ అని ఇంగ్లీష్ లో సీరియస్ గా పిలుస్తున్నాడు. ఈ క్రమంలో ఓం రౌత్ కి ప్రభాస్ వార్నింగ్ ఇచ్చాడని, ఆదిపురుష్ టీజర్ నచ్చని ఆయన సహనం కోల్పోయి దర్శకుడిని తిట్టాడనే ప్రచారం జరుగుతుంది. కాగా ఆదిపురుష్ మూవీ 2023 జనవరి 12న విడుదల కానుంది. విడుదలకు మూడు నెలల సమయం ఉండగా కొంతలో కొంత మెరుగైన అవుట్ ఫుట్ వచ్చేలా ప్రయత్నం చేయాలని ఫ్యాన్స్ దర్శకుడిని రిక్వెస్ట్ చేస్తున్నారు.
Om you coming to my room 🙂 pic.twitter.com/kM1UppGVr3
— Venu™ (@TheVenuPrabhas) October 3, 2022