Prabhas expensive tree: ఓ చెట్టు కోసం ఏకంగా కోటి రూపాయలు హీరో ప్రభాస్ ఖర్చు చేశాడన్న న్యూస్… టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. అసలు చెట్టుకు అంత రేటు ఎందుకు? దాని ప్రత్యేకతలు ఏమిటీ? ఈ స్టోరీలో చూద్దాం..
ప్రభాస్(PRABHAS) దేశంలోనే అతిపెద్ద స్టార్. ఆయనతో మూవీ చేయాలంటే కనీసం రూ. 500 కోట్ల బడ్జెట్ కావాలి. బాహుబలి అనంతరం ఆయన రేంజ్ మారిపోయింది. వరల్డ్ వైడ్ అభిమానులను సంపాదించాడు. ఆయనకున్న మార్కెట్ రీత్యా రూ. 150 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ప్లాప్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు సైతం వందల కోట్లు రాబడతాయి. ఇక ప్రభాస్ కి భోళా శంకరుడు అనే పేరుంది. ఏ స్థాయిలో సంపాదిస్తాడో.. అలానే ఖర్చు చేస్తారు. దానధర్మాలు చేయడంలో, ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటించడంలో వెనకడుగు వేయడు. తన తోటి స్టార్స్ కంటే రెండింతలు ఎక్కువ ప్రకటిస్తారు.
Also Read: అల్లు అర్జున్ ఆ ఒక్క సినిమాతో చాలా వరకు వెనకబడ్డాడా..?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపత్కర పరిస్థితుల్లో ఉన్న సందర్భాల్లో ప్రభాస్ కోట్లలో విరాళాలు ప్రకటించారు. అరణ్యాలను దత్తత తీసుకుని, ప్రకృతిని కాపాడుతున్నారు. భోజన ప్రియుడైన ప్రభాస్ తన తోటి నటులకు అరుదైన వంటకాలతో ఆతిథ్యం ఇస్తారు. ప్రభాస్ కోరిన వంటలు చేసి వడ్డించేందుకు ప్రత్యేకంగా ఒక చెఫ్ టీమ్ పని చేస్తుంది. సెట్ లో అందరూ రుచికరమైన క్వాలిటీ భోజనం చేసేలా ప్రభాస్ చర్యలు తీసుకుంటాడని సమాచారం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభాస్ ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి.
తాజాగా ఆయన మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. కోటి రూపాయలు వెచ్చించి ఒక చెట్టును కొన్నారు. చెట్టుకు కోటి రూపాయలా? అని ఆశ్చర్యపోవచ్చు. కానీ అది కల్ప వృక్షం అట. పురాణాల్లో మనం ఈ కల్పవృక్షం గురించి వినే ఉంటాము. ఏది అడిగితే అది ఇచ్చే అద్భుత మహిమలు ఉన్న చెట్టును… కల్పవృక్షం అంటారు. పురాణాల సంగతి అటుంచితే… కల్ప వృక్షం ఇంట్లో ఉంటే భోగ భాగ్యాలకు కొదవ ఉండదు అని ఒక నమ్మకం. ఈ క్రమంలో ప్రభాస్ కొత్తగా నిర్మించుకుంటున్న తన ఇంటి ఆవరణలో ఈ చెట్టును తెచ్చి నాటాడు అట. వంద ఏళ్ల వయసున్న ఆ చెట్టు ఖరీదు రూ. 1 కోటి అట. ఇలాంటి చెట్టు దేశంలో ముఖేష్ అంబానీ వద్దే ఉందని సమాచారం.
Also Read: నైట్ పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేసిన అనసూయ.. క్రేజీ పిక్స్ వైరల్
దాంతో ఈ విషయంలో ప్రభాస్ ఏకంగా అంబానీతో పోటీపడ్డారు అంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ విడుదలకు సిద్ధం అవుతుంది. అలాగే దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ వార్ అండ్ లవ్ డ్రామా చిత్రీకరణ జరుపుకుంటుంది. కల్కి 2, స్పిరిట్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాయని సమాచారం.