Allu Arjun Movie: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్న హీరోల్లో తెలుగు హీరోలు ముందు వరుసలో ఉన్నారు. ప్రభాస్ (Prabhas) లాంటి నటుడు బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియాని శాసించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఆ తర్వాత పుష్ప 2 (Pushpa 2) సినిమాతో అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. 1850 కోట్లకు పైన కలెక్షన్లను కొల్లగొట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలేవ్వరికీ సాధ్యం కానీ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు… ఇక ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీని టచ్ చేసేవారు ఎవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మన హీరోలతో సినిమాలు చేయడానికి ఇతర భాషల దర్శకులు పోటీ పడుతున్నారు. మన దర్శకులతో సినిమాలు సెట్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న హీరోలందరు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం. మరి ఏది ఏమైనా కూడా ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి దక్కిన ఒక అరుదైన గౌరవం అనే చెప్పాలి… మరి ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఇతర భాషల దర్శకులతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన అట్లీ (Atlee) డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఇండియాలో ఉన్న పలు రికార్డులు బ్రేక్ చేసి కొత్త రికార్డులను క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది…
Also Read: నాని తో పోటీ పడలేక చేతులెత్తేసిన హీరోలు..?నాని కి వాళ్లకు ఉన్న తేడా అదేనా..?
ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కెరీయర్ స్టార్టింగ్ లో ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి గుర్తింపును తీసుకొచ్చినప్పటికి ఒక సినిమా చేయడం వల్ల ఆయన భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే వరుడు (Varudu)… గుణశేఖర్ (Gunsshekar) దర్శకత్వంలో ఐదు రోజుల పెళ్లి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అనుకున్న మేరకు సక్సెస్ ని సాధించలేదు.
అల్లు అర్జున్ ఈ సినిమా మీద భారీ ఆశాలైతే పెట్టుకున్నాడు. ఒక్కడు (Okkadu) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న గుణశేఖర్ కి అల్లు అర్జున్ సైతం ఒక్కడు లాంటి సినిమా చేయమని డేట్స్ అయితే ఇచ్చారట. కానీ గుణశేఖర్ మాత్రం అల్లు అర్జున్ పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగా సినిమాను చేయలేకపోయాడు.
Also Read: నితిన్ ను దిల్ రాజు బలిపశువును చేశాడా? ‘ఎల్లమ్మ’ పరిస్థితేంటి..?
దానివల్ల అల్లు అర్జున్ తో పాటు అతని అభిమానులు కూడా తీవ్రమైన నిరాశకు గురయ్యారు. ఒక్కసారి అల్లు అర్జున్ ఒక 10 సంవత్సరాలు వెనక్కు పడిపోయాడనే చెప్పాలి. ఈ సినిమా చేయకపోయి ఉంటే అతనికి చాలా బాగా గ్రోత్ అయితే వచ్చేది. ఇక ఈ సినిమా తర్వాత వేదం(Vedam), ఆర్య 2 (Aarya 2) లాంటి సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నాడు…